‘ఇండిగో’ నిర్లక్ష్యం పాట్నాకు వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్‌పూర్‌కు..! విచారణకు డీజీసీఏ ఆదేశం..!

IndiGo | ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రయాణికుడు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. ఢిల్లీ నుంచి పాట్నాకు వెళ్లాల్సి ఉండగా.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఉదయప్‌పూర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఈ ఘటన జనవరి 30న చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అఫ్సన్‌ హుస్సేన్‌ అనే ప్రయాణికుడు దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో బిహార్‌లోని పాట్నాకు వెళ్లాల్సి ఉంది. అయితే, అతను పాట్నాకు వెళ్లే విమానం […]

‘ఇండిగో’ నిర్లక్ష్యం పాట్నాకు వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్‌పూర్‌కు..! విచారణకు డీజీసీఏ ఆదేశం..!

IndiGo | ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రయాణికుడు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. ఢిల్లీ నుంచి పాట్నాకు వెళ్లాల్సి ఉండగా.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఉదయప్‌పూర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఈ ఘటన జనవరి 30న చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అఫ్సన్‌ హుస్సేన్‌ అనే ప్రయాణికుడు దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో బిహార్‌లోని పాట్నాకు వెళ్లాల్సి ఉంది. అయితే, అతను పాట్నాకు వెళ్లే విమానం కాకుండా ఉదయ్‌పూర్‌కు వెళ్లే మరో విమానం ఎక్కాడు. హుస్సేన్ ఇండిగో ఫ్లైట్ (6E-214)లో పాట్నాకు వెళ్లేందుకు టికెట్‌ బుక్‌ చేసుకున్నాడని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. షెడ్యూల్‌ విమానంలో వెళ్లేందుకు జనవరి 30న ఢిల్లీలోని విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే, అతను పొరపాటును ఇండిగోకు చెందిన మరో ఫ్లైట్ 6E-319 ఉదయపూర్‌కు బయలుదేరాడు. అక్కడికి చేరుకున్న తర్వాత మరో విమానం ఎక్కినట్లుగా తెలిసింది.

క్షమాపణలు చెప్పిన ఎయిర్‌లైన్స్‌

ఉదయ్‌పూర్‌ విమానాశ్రయంలో అధికారులకు సదరు వ్యక్తి ఫిర్యాదు చేయగా.. విషయాన్ని ఇండిగో ఎయిర్స్‌లైన్‌కు సమాచారం అందించారు. దీంతో స్పందించిన ఎయిర్‌లైన్స్‌ అదే రోజు మరో విమానంలో ఢిల్లీకి.. అక్కడి నుంచి 31న మరో విమానంలో పాట్నాకు పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు శుక్రవారం కంపెనీ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుడికి జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. ఈ విషయంపై అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. ఈ వ్యవహారంపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఘటనకు సంబంధించి నివేదిక సమర్పించాలని ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించినట్లు ఏవియేషన్‌ రెగ్యులేటర్‌ అధికారి ఒకరు తెలిపారు.

రెండు తనిఖీలను దాడి వెళ్లడం ఎలా సాధ్యం?

ప్రయాణికుల బోర్డింగ్‌ పాస్‌ను ఎందుకు సరిగా స్కాన్‌ కాలేదనే డీజీసీఏ విచారణలో తేలుతుందని ఆయన అధికారి తెలిపారు. ప్రయాణికుడు ఎలా మరో విమానం ఎక్కడన్నది ఆశ్చర్యంగా ఉందని.. రెండు పాయింట్లలో తనిఖీలో గుర్తించకపోవడం ఎలా సాధ్యమని అధికారులు ఆరా తీస్తున్నారు. విశేషమేమిటంటే, గత 20 రోజుల్లో ఇండిగో విమానంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోది. అంతకుముందు జనవరి 13న ఇండోర్ వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడి మరో విమానంలో నాగ్‌పూర్‌కు వెళ్లాల్సి వచ్చింది.