విశాఖకు ఇన్ఫోసిస్.. మే నుంచి కార్యకలాపాలు

విధాత‌: విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నాక, ఇక అక్కడికి ఆయన మకాం మార్చేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అదే తరుణంలో విశాఖను పారిశ్రామిక కేంద్రంగా.. సాఫ్ట్ వేర్ ఇతర రంగాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటుకు కూడా జగన్ కృషి చేస్తూ మొత్తానికి ఆంధ్రకు విశాఖ మాత్రమే దిక్కు అనే పరిస్థితికి జనాన్ని మోటివేట్ చేస్తూ వస్తున్నారు. విశాఖను రాజధానిగా చేసేందుకు న్యాయశాఖ, కోర్టులు అడ్డంకులు కల్పించవచ్చు గాక.. కానీ జగన్ మాత్రం విశాఖకు డిసైడ్ అయ్యారు. […]

విశాఖకు ఇన్ఫోసిస్.. మే నుంచి కార్యకలాపాలు

విధాత‌: విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నాక, ఇక అక్కడికి ఆయన మకాం మార్చేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అదే తరుణంలో విశాఖను పారిశ్రామిక కేంద్రంగా.. సాఫ్ట్ వేర్ ఇతర రంగాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటుకు కూడా జగన్ కృషి చేస్తూ మొత్తానికి ఆంధ్రకు విశాఖ మాత్రమే దిక్కు అనే పరిస్థితికి జనాన్ని మోటివేట్ చేస్తూ వస్తున్నారు.

విశాఖను రాజధానిగా చేసేందుకు న్యాయశాఖ, కోర్టులు అడ్డంకులు కల్పించవచ్చు గాక.. కానీ జగన్ మాత్రం విశాఖకు డిసైడ్ అయ్యారు. ఎవరు ఏమనుకున్నా.. ఏ అడ్డంకులు వచ్చిన అధికారికమో, అనధికారికమో.. ఏమో కానీ విశాఖ మాత్రమే ఏపీకి ముఖచిత్రం అయ్యేలా చూస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచి ఆయన విశాఖలోనే ఉంటారని అంటున్నారు.

అదే సమయంలో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు కూడా అక్కడికి వచ్చేలా చూస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ విశాఖ కేంద్రంగా తన కార్యకలాపాలు సాగించేందుకు సిద్ధమైంది. ఈ కంపెనీ మే 31 నుంచి విశాఖ కేంద్రంగా ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను రుషికొండ సిగ్నేచర్ టవర్స్‌లో ప్రారంభింస్తుంది. ఈ శాఖలో దాదాపు 650 మంది ఉద్యోగులు ఉంటారని పేర్కొంది.

విశాఖ కేంద్రంగా ప్రారంభమయ్యే ఇన్పోసిస్‌లో వెయ్యి మంది ఉద్యోగులకు అవకాశాలు కల్పించనున్నట్లు ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సైతం గతంలో వెల్లడించారు. ఈ మేరకు కంపెనీకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం సమకూరుస్తున్నట్లు తెలిపారు. కళాశాలల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త ఉద్యోగుల నియామకాన్ని చేపడుతారని పేర్కొన్నారు. మున్ముందు ఐబీఎం, టీసీఎస్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు సైతం విశాఖ పట్టణానికి వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.