Apple iphones | ఐఫోన్‌ వాడుతున్నారా జాగ్రత్తా..? లేకపోతే బ్యాంకు అకౌంట్లు ఖాళీయే..!

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఆపిల్‌ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్‌ ఉన్నది. అయితే, సెక్యూరిటీ, డేటా ప్రైవసీకి ఆపిల్‌ ఉత్పత్తులు పెట్టింది పేరు

Apple iphones | ఐఫోన్‌ వాడుతున్నారా జాగ్రత్తా..? లేకపోతే బ్యాంకు అకౌంట్లు ఖాళీయే..!

Apple iPhones | ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఆపిల్‌ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్‌ ఉన్నది. అయితే, సెక్యూరిటీ, డేటా ప్రైవసీకి ఆపిల్‌ ఉత్పత్తులు పెట్టింది పేరు. ఈ క్రమంలో చాలా మంది ఐఫోన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే, టెక్‌ నిపుణులు ఐఫోన్‌ యూజర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వారికి తెలియకుండా ఫోన్‌లలో ఓ ప్రమాదకరమైన వైరస్‌ చేరింది. ఇది సెక్యూరిటీ డేటాను తస్కరించి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నది.


ఈ వైరస్‌ పేరు ‘గోల్‌పికాక్స్‌ ట్రోజన్‌’గా టెక్‌ నిపుణులు పేర్కొన్నారు. ఐఫోన్‌ యూజర్లందరూ తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి ట్రోజన్‌ వైరస్‌లు గత కొద్ది దశాబ్దాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి ఐఫోన్స్‌నే టార్గెట్‌ చేస్తున్నాయి. ఈక్రమంలో గోల్డ్​పికాక్స్​ ట్రోజన్​ వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ వైరస్‌లో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌ ఉండడంపై టెక్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


టెక్‌ రాడార్‌ నివేదిక ప్రకారం.. గోల్డ్‌పికాక్స్‌ ట్రోజన్‌ను గతేడాది అక్టోబర్‌లో మొదటిసారి గుర్తించారు. అప్పటి నుంచి ట్రోజన్‌ అప్‌డేట్‌ అవుతూ వస్తున్నది. చివరకి ఐఓఎస్‌ డివైజ్‌లకు సైతం పెను ముప్పుగా మారింది. ప్రస్తుతం ఐఫోన్స్‌ లక్ష్యంగా దాడి చేస్తున్నది. ట్రోజన్‌ ఫోన్‌లోకి ప్రవేశించి ఫేస్‌ రికగ్నేషన్‌ సమాచారం, ఐడెంటిటీ డాక్యుమెంట్స్​, టెక్ట్స్​ మెసేజ్​లను స్కాన్​ చేస్తుందని తెలుస్తున్నది. వాటిలో బ్యాంకింగ్‌ సమాచారం దొరికితే అకౌంట్లను లూటీ చేస్తున్నది. బయోమెట్రిక్​ డేటా దొరికితే ఏఐ ఆధారిత డీప్‌ఫేక్స్‌ చేస్తూ అథరైజ్‌ లేకుండా బ్యాంక్‌ అకౌంట్స్‌కు యాక్సెస్‌ పొందడం వరకు ప్రమాదాలుంటాయి. ప్రస్తుతానికి ఈ తరహా కేసులు వియత్నాం, థాయ్‌లాండ్‌లో నమోదయ్యాయి. గోల్డ్‌పికాక్స్‌ ట్రోజన్‌ వైరస్‌ ఇంగ్లిష్‌ స్పీకింగ్‌ దేశాలకు పాకొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. గోల్డ్​పికాక్స్​ వైరస్​ ఆండ్రాయిడ్​ డివైజులో లింకస్​, యాప్స్​, ఇతర మార్గాల ద్వారా వైరస్​లు ఫోన్స్​లోకి వెళ్తుంటాయి.


ఐఓఎస్​ డివైజ్​లలో కష్టమైన విషయమే అయినా.. దాన్ని ఛేదించుకొని మరీ వెళ్తున్నది. దాంతో వైరస్‌ ఎంత ప్రమాదకరమైందో తెలుస్తుంది. ఆపిల్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన టెస్ట్‌ఫ్లైట్‌ని హ్యాకర్లు హ్యాక్‌ చేస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచే గోల్డ్‌పికాక్స్‌ను మిగతా డివైజెస్‌లోకి వ్యాప్తి చేస్తున్నది. ఈ క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


ఎట్టిపరిస్థితుల్లోనూ టెస్ట్‌ఫ్లైట్‌ యాప్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని పేర్కొంటున్నారు. మొబైల్​ డివైజ్​ మేనేజ్​మెంట్​ ప్రొఫైల్స్​కి కూడా దూరంగా ఉండాలని.. యూఎస్​బీ ద్వారా మాక్​కి కనెక్ట్​ చేస్తున్న సమయంలో మాల్‌వేర్‌ స్కానింగ్‌ సెటప్‌ను రన్‌ చేయాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. లాక్​డౌన్​ మోడ్​ని ఆన్​ చేసి, యాపిల్​ స్టోలెన్​ డివైజ్​ ప్రొటెక్షన్​ని యాడ్​ చేస్తే ఫోన్‌ సెక్యూరిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.