IPL Live Streaming | నేడు ఐపీఎల్‌లో GT Vs CSK.. గురు శిష్యుల్లో విజయం ఎవరిదో..?

IPL Live Streaming | విధాత: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 16వ సీజన్‌ గ్రాండ్‌గా ప్రారంభంకానున్నది. గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరుగనున్నది. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్‌ జరుగనుండగా.. తొలిమ్యాచ్‌లో విజయం సాధించి.. గ్రాండ్‌గా సీజన్‌ను ప్రారంభించాలని ఇరుజట్లు భావిస్తున్నారు. గుజరాత్‌ జట్టుకు హార్దిక్‌ పాండ్యా స్వయంగా ధోనీకి వీరాభిమాని. మహేంద్రుడి నుంచి ఎంతో నేర్చుకున్నాడు. ఈ క్రమంలో గురు శిష్యులు మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుండగా.. ఆద్యాంతం […]

IPL Live Streaming | నేడు ఐపీఎల్‌లో GT Vs CSK.. గురు శిష్యుల్లో విజయం ఎవరిదో..?

IPL Live Streaming |

విధాత: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 16వ సీజన్‌ గ్రాండ్‌గా ప్రారంభంకానున్నది. గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరుగనున్నది. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్‌ జరుగనుండగా.. తొలిమ్యాచ్‌లో విజయం సాధించి.. గ్రాండ్‌గా సీజన్‌ను ప్రారంభించాలని ఇరుజట్లు భావిస్తున్నారు.

గుజరాత్‌ జట్టుకు హార్దిక్‌ పాండ్యా స్వయంగా ధోనీకి వీరాభిమాని. మహేంద్రుడి నుంచి ఎంతో నేర్చుకున్నాడు. ఈ క్రమంలో గురు శిష్యులు మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుండగా.. ఆద్యాంతం ఉత్కంఠభరితంగానే సాగనున్నది. ఈ సీజన్‌కు ముందు రెండు జట్లలో పలు మార్పులు జరిగాయి. మినీ వేలంలో ఇరు జట్లు కొంత మంది మంచి ఆటగాళ్లను చేర్చుకున్నాయి. బెన్ స్టోక్స్ రాకతో చెన్నై జట్టు మరింత పటిష్టంగా మారింది. కేన్ విలియమ్సన్ గుజరాత్ జట్టులో చేరాడు.

మ్యాచ్‌ లైవ్‌ ఇలా చూసేండి..

గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ శుక్రవారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలుకానుండగా.. రాత్రి 7 గంటలకు టాస్‌ జరుగనున్నది. స్టార్ స్పోర్ట్స్ గ్రూప్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసార హక్కులను దక్కించుకుంది.

ఈ టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ గ్రూప్ ఛానెల్‌లలో వివిధ భాషల్లో ప్రసారం చేయనున్నది. ఈ సారి ఫోన్లు, ల్యాప్‌ టాప్‌ల్లోనూ మ్యాచ్‌ను ఫ్రీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించొచ్చు. భారత్‌లో జియో సినిమా యాప్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. ఈ యాప్‌లో ప్రత్యక్ష మ్యాచ్‌లను చూసేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. Jio సినిమా యాప్‌ని మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లన్నింటినీ ఉచితంగా చూసేయొచ్చు.

తొలి మ్యాచ్‌లో జట్ల అంచనా..

చెన్నై సూపర్ కింగ్స్: రితురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్, కెప్టెన్), డ్వేన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్, సిమర్జిత్ సింగ్.

గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్, కేన్ విలియమ్సన్, శ్రీకర్ భరత్ (వికె), హార్దిక్ పాండ్యా (సి), మాథ్యూ వేడ్, రాహుల్ తెవాటియా, ఆర్ సాయి కిషోర్, రషీద్ ఖాన్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ.