Gutta Sukhender Reddy | వ్యక్తులు చేసిన తప్పుని వ్యవస్థకు ఆపాదించడం సరికాదు

విధాత: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో వ్యక్తులు చేసిన తప్పులను వ్యవస్థకు ఆపాదించడం సరికాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) అన్నారు. పేపర్ల లీకేజీ కేసుకు ప్రతిపక్షాలు రాజకీయరంగు రుద్దడం సరికాదన్నారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని, పేపర్ లీక్ దాచితే దాగేది కాదన్నారు. భవిష్యత్తు రాజకీయ నాయకులపై బురద చల్లేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నార‌న్నారు. ప్రతి చిన్న విషయాన్ని సిబిఐకి ఇవ్వడం అంటే పోలీసు వ్యవస్థను రద్దు చేయాలా […]

  • By: Somu |    latest |    Published on : Mar 23, 2023 10:35 AM IST
Gutta Sukhender Reddy | వ్యక్తులు చేసిన తప్పుని వ్యవస్థకు ఆపాదించడం సరికాదు

విధాత: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో వ్యక్తులు చేసిన తప్పులను వ్యవస్థకు ఆపాదించడం సరికాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) అన్నారు. పేపర్ల లీకేజీ కేసుకు ప్రతిపక్షాలు రాజకీయరంగు రుద్దడం సరికాదన్నారు.

విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని, పేపర్ లీక్ దాచితే దాగేది కాదన్నారు. భవిష్యత్తు రాజకీయ నాయకులపై బురద చల్లేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నార‌న్నారు.

ప్రతి చిన్న విషయాన్ని సిబిఐకి ఇవ్వడం అంటే పోలీసు వ్యవస్థను రద్దు చేయాలా అని ప్రశ్నించారు. పాలన,విచారణ అధికారులకు ప్రాంతీయతత్వాన్ని ఆపాదించొద్దన్నారు. కేంద్ర సంస్థలు ప్రతిపక్షాలను వేధిస్తున్నాయన్నారు.

గ్రూపుల పంచాయతీ తేల్చుకోలేకనే కాంగ్రెస్ నాయకులు పాదయాత్రలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కేంద్ర సహాయం ఎదురు చూడకుండా అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ ఎకరాకు 10,000 సహాయం ప్రకటిస్తూ వెంటనే పంపిణీకి ఆదేశించడం హర్షినీయమన్నారు.