IT Raids | బీఆర్ఎస్ MP, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు
IT Raids | భారత్ రాష్ట్ర సమితికి చెందిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, అదే పార్టీకి చెందిన నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లోని మర్రి జనార్ధన్ రెడ్డి ఇంటికి మూడు వాహనాల్లో ఐటీ అధికారులు వెళ్లారు. కొత్తపేటలో పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. జనార్ధన్ రెడ్డికి సంబంధించిన […]

IT Raids | భారత్ రాష్ట్ర సమితికి చెందిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, అదే పార్టీకి చెందిన నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లోని మర్రి జనార్ధన్ రెడ్డి ఇంటికి మూడు వాహనాల్లో ఐటీ అధికారులు వెళ్లారు. కొత్తపేటలో పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.
జనార్ధన్ రెడ్డికి సంబంధించిన జేసీ బ్రదర్స్‌లోనూ తనిఖీలు చేస్తున్నారు. పన్ను చెల్లింపులకు సంబంధించిన వివిధ పత్రాలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరో వైపు హైదరాబాద్ నగరంలోని వివిధ రియల్ ఎస్టేట్ సంస్థల కార్యాలయాలు, షాపింగ్ మాల్స్‌లోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సుమారు 50 ఐటీ బృందాలు వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.
అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ ఇంట్లో ఏకకాలంలో ఐటీ సోదాలు 3 నిర్వహించడంతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. గతంలో మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు చేయగా తాజాగా ఒకేసారి ఎమ్మెల్యే, ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది