Harish Rao : ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు రేవంత్ రెడ్డి జల ద్రోహం
రేవంత్ రెడ్డిది జల ద్రోహం! చంద్రబాబుకు గురుదక్షిణ ఇచ్చేందుకు తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతున్నారని హరీశ్ రావు ధ్వజం. ఢిల్లీ మీటింగ్ తెలంగాణకు బ్లాక్ డే అంటూ విమర్శలు.
విధాత, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు సంబంధించి శుక్రవారం సీడబ్ల్యుసీ చైర్మన్ అధ్యక్షతన న్యూఢిల్లీలో కొనసాగనున్న సమావేశం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి జల ద్రోహం చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు ఆరోపించారు. జలద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుది అయితే.. పొడిచేది రేవంత్ రెడ్డి అని, పథకం ప్రకారం రేవంత్ రెడ్డి మొదటి నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కార్‌కు సహకరిస్తున్నాడు అని, కాళోజీ ముందే ఊహించి చెప్పినట్లుగా తెలంగాణకు సొంత ప్రాంతం వాడే తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు అని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. సమైక్య పాలనలో మనకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్.. నేడు మరో చారిత్రక ద్రోహం చేస్తున్నది అని, ఈరోజు డిల్లీలో జరుగుతున్న ఇరిగేషన్ మీటింగ్ సాక్షిగా రేవంత్ ప్రభుత్వం మరణ శాసనం రాయబోతున్నదని విమర్శించారు. ఒక వేళ తెలంగాణ నీటి హక్కులపై తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డే గా మిగిలిపోతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ జలద్రోహిని మీటింగ్ కు పంపుతారా ?
తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా వ్యతిరేకించిన వ్యక్తి ఆదిత్యనాధ్ దాస్ ను మీటింగ్ కు పంపడం అంటే తెలంగాణ ద్రోహం చేయడానికే కదా? అని, మన తెలంగాణ నీళ్లను ఏపీకి తీసుకువెళ్లే కుట్ర ఇది అని, తెలంగాణ సోయి ఉన్న ఒక్క ఇంజినీర్ దొరకలేదా? అని హరీష్ రావు మండిపడ్డారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు చేస్తున్నారని, పోను అంటూనే మీటింగ్ లకు అటెండ్ అవడం అంటే ఏమిటి? అర్ధం అని ప్రశ్నించారు. తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్ప చెప్పడమేనా మీ చర్చల లక్ష్యం అని హరీష్ రావు నిలదీశారు. అది బనకచర్ల అయినా, నల్లమల సాగర్ అయినా మారింది పేరు మాత్రమే కానీ, ఏపీ జల దోపిడి ఆగలేదు అని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి హక్కులను కాలరాసేందుకు ఏపీ ఒత్తిడితో కేంద్రం నిర్వహిస్తున్న ఈరోజు ఢిల్లీ సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం అని, రేవంత్ రెడ్డి పెట్టిన కండీషన్లకు వచ్చిన సమాధానం బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అని హరీష్ రావు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబుకు గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే తెలంగాణను సాధించిన బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదన్నారు. నీ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తెలంగాణ నీటి హక్కుల కోసం మరో పోరాటం చేస్తం అన్నారు.
ఏపీ ఒత్తిడితోనే నేటి మీటింగ్
ఏపీ ఒత్తిడితో జరుగుతున్న మీటింగ్ లో నేడు ఇంజినీర్లు పాల్గొంటున్నారని, పేరుకు జలవివాదాల మీటింగ్ కానీ,మన 200 టీఎంసీలను గంపగుత్తగా తరలించుకుపోయే నల్లమలసాగర్ అనే ప్రాజెక్టు సంబంధించిన కుట్ర ఇది అని హరీష్ రావు ఆరోపించారు. ఇలాగే గతంలో కేంద్ర జల్‌శక్తిశాఖ నిర్వహించిన సమావేశంలో ఏపీ ఈ ప్రాజెక్టునే ఏకైక ఎజెండాగా ముందుపెట్టింది అని, ఇప్పుడు కూడా ఏపీ నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టునే తెరమీదకు తెచ్చి చర్చ చేస్తున్నారు అని, బీఆర్ఎస్ నిలదీస్తే..డిసెంబర్ 30వ తేదీన నేను ఉత్తరం రాస్తే.. తెల్లారి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించిందన్నారు. నల్లమల సాగర్ కు డిపిఆర్ వెంటనే ఆపాలి, కేంద్రం అనుమతుల ప్రక్రియను తక్షణం ఆపాలి అని, ప్రీ ఫీజబులిటి రిపోర్టు ఆపినట్లు ఏపీ హామి ఇవ్వాలని రెండు కండీషన్లు పెట్టాని గుర్తు చేశారు. ఈ రెండు కండీషన్లకు కేంద్రం హామి ఇచ్చిందా? ఏపీ హామి ఇచ్చిందా? అని ప్రశ్నించారు. వాటిపై స్పష్టత లేకుండానే ఈ రోజు మీటింగ్ కు హాజరవ్వడంలో అర్ధం ఏమిటని హరీశ్ రావు నిలదీశారు. గతంలో 9వ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ లో పాల్గొన్న ఆదిత్యా నాథ్ దాస్కాళేశ్వరం, గోదావరి, సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టు, తుపాకులగూడెం, మిషన్ భగీరథ, చనాక కొరటా, రామప్ప డైవర్షన్ లు అన్నీ అక్రమ ప్రాజెక్టులు, వీటిని నిలిపి వేయాలని కోరిన విషయం మరువరాదన్నారు. కేసీఆర్ పోరాడి గోదావరిలో 400 టీఎంసీలు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చారు అని, గోదావరి మీద 10 డీపీఆర్ లు పంపి 7 ప్రాజెక్టులకు అనుమతులు సాధించారు అని చెప్పుకొచ్చారు. రెండేళ్లలో కాంగ్రెస్ సర్కార్ ఒక్క డీపీఆర్ పంపింది లేదు, ఒక్క అనుమతి తెచ్చింది లేదు అన్నారు.
బీఆర్ఎస్ సేద్యం..రేవంత్ చోద్యం
వార్దా, కాళేశ్వరం మూడో టీఎంసీలకు సగం అనుమతులు వస్తే, పూర్తి చేయకుండా డీపీఆర్ లు వాపస్ చేసింది అని, రేవంత్ రెడ్డి పాలనలో డీపీర్ లు వాపస్ వచ్చిన పరిస్థితి అని హరీష్ రావు విమర్శించారు. మన డీపీఆర్ లు వాపస్ తెచ్చుకుంటవు, నల్లమల సాగర్ కు జెండా ఊపుతవు అని, చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి నిన్ను తెలంగాణ సమాజం క్షమించదు అని హరీశ్ రావు విమర్శించారు. ఢిల్లీకి, దావోస్ కు తిరగడమే తప్ప రేవంత్ కు పాలన మీద దృష్టి లేదు అని, బీఆర్ఎస్ సేద్యంపై దృష్టి సారిస్తే, రేవంత్ చోద్యం చూస్తున్నడాని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలన గురించి ఎకనామిక్ సర్వే రిపోర్టే స్పష్టం చేసిందని, 2 కోట్ల 20లక్షల ఎకరాల మాగాణిగా మారిందని చెప్పిందని,కాళేశ్వరం ద్వారా 17 లక్షల 823 ఎకరాల స్థిరీకరణ, మిషన్ కాకతీయ ద్వారా పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టు సాధ్యమైందని, 32 లక్షల ఎకరాల ఆయకట్టు బీఆర్ఎస్ సాధించిందని ఎకనామిక్ సర్వే వెల్లడించిందని హరీశ్ రావు గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి :
విద్యార్థులకు అలర్ట్..తెలంగాణ ఈఏపీ సెట్..పీజీ ఈసీఈటీ పరీక్షల షెడ్యూల్ విడుదల
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి హార్వర్డ్ కెనడీ స్కూల్ సర్టిఫికెట్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram