IT Rides | ఒక వర్గంపై దోపిడీ ముద్ర వేసే యత్నం.. రాష్ట్రంలో ఐటీ దాడులపై రెడ్డి జాగృతి
IT Rides రాజకీయ కోణమూ ఉన్నదని వెల్లడి విధాత: రాష్ట్రంలో గత కొన్నిరోజుల నుంచి జరుగుతున్న ఐటీ, ఈడీ సోదాల వెనుక రాజకీయ కోణమే కాకుండా, ఒక వర్గాన్ని ఆర్థిక దోపిడీ వర్గంగా ముద్రవేసే కుట్ర దాగి ఉన్నదని రెడ్డి జాగృతి ఒక ప్రకటనలో విమర్శించింది. రెడ్లకు వ్యవసాయ దారులుగా, భూస్వాములుగా, భూ దాతలుగా, సాయుధ రైతాంగ పోరాట నాయకులుగా తెలంగాణలో ఒక చరిత్ర ఉన్నదని తెలిపింది. గ్రామాల్లో ఇతర వర్గాల వారికి సహాయం చేసే గుణం […]

IT Rides
- రాజకీయ కోణమూ ఉన్నదని వెల్లడి
విధాత: రాష్ట్రంలో గత కొన్నిరోజుల నుంచి జరుగుతున్న ఐటీ, ఈడీ సోదాల వెనుక రాజకీయ కోణమే కాకుండా, ఒక వర్గాన్ని ఆర్థిక దోపిడీ వర్గంగా ముద్రవేసే కుట్ర దాగి ఉన్నదని రెడ్డి జాగృతి ఒక ప్రకటనలో విమర్శించింది. రెడ్లకు వ్యవసాయ దారులుగా, భూస్వాములుగా, భూ దాతలుగా, సాయుధ రైతాంగ పోరాట నాయకులుగా తెలంగాణలో ఒక చరిత్ర ఉన్నదని తెలిపింది.
గ్రామాల్లో ఇతర వర్గాల వారికి సహాయం చేసే గుణం కలిగిన వాళ్లుగా ఉంటూ వచ్చిన రెడ్డి సామాజికవర్గం ప్రజలలో ఉంటూ రాజకీయంగా, వ్యాపారపరంగా ఎదిగారని, దానధర్మాలు చేస్తూ ప్రజారంజకంగా పరిపాలన అందించిందని గుర్తు చేసింది. సహజంగా నాయకత్వ లక్షణాలు ఉన్న రెడ్డి సామాజిక వర్గం.. స్వతంత్ర పోరాట కాలం నుంచి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లో ఉంటూ రాజకీయంగా ఎదిగారని గుర్తు చేసింది.
తర్వాత అనేక పార్టీలలో రాజకీయంగా విస్తరించారని తెలిపింది. కానీ.. గత కొన్నాళ్లుగా రెడ్డి నాయకులపైన, వ్యాపార వేత్తలపైన ఐటీ, ఈడీ విభాగాల సోదాలు చూస్తుంటే.. రాజకీయ పరంగానే కాకుండా.. రెడ్లను ఆర్థిక దోపిడీ వర్గంగా ముద్ర వేసే కుట్ర కనిపిస్తున్నదని రెడ్డి జాగృతి ఆందోళన వ్యక్తం చేసింది.
వివిధ పార్టీల్లోని ఇతర సామాజిక వర్గాల నాయకులపై ఆరోపణలు వచ్చినా వారిపై ఎలాంటి దర్యాప్తూ జరుగడం లేదని, రెడ్డి జాగృతి అధ్యక్షుడు బుట్టెంగారి మాధవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామల కృష్ణారెడ్డి ఆరోపించారు.
ఐటీ ఈడీ సోదాలను వీరు తీవ్రంగా ఖండించారు. గతంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపైనా, మంత్రి మల్లారెడ్డిపైనా ఐటీ దాడులు జరిగినా ఏమీ నిగ్గు తేల్చలేదని వారు గుర్తు చేశారు.