Hyderabad: సురానా గ్రూప్‌లో ముగిసిన ఈడీ సోదాలు

  • By: sr    news    Apr 17, 2025 11:11 PM IST
Hyderabad: సురానా గ్రూప్‌లో ముగిసిన ఈడీ సోదాలు

విధాత: బ్యాంకులను మోసం చేసిన సురానా గ్రూప్స్ , సూర్యా డెవలపర్స్ సంస్థలపై హైదరాబాద్ లో ఈడీ చేపట్టిన రెండు రోజుల సోదాలు ముగిశాయి. నరేందర్ సురానా, సతీష్ చంద్రలు కలిసి భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ పేర్కొంది. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం చేశారని.. కొద్ది నెలల్లోనే వందల కోట్లకు పైగా లావాదేవీలు నిర్వహించారని పేర్కొంది.

వందల కోట్ల నిధులను ఎక్కడికి తరలించారన్న దానిపై విచారణ కొనసాగుతుందని అధికారిక ప్రకటనలో ఈడీ పేర్కొంది. చెన్నై ఎస్ బీఐ నుంచి వేలకోట్లు రుణాలు తీసుకుని మోసగించిన కేసులో 2012లో సురానా సురానా గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. 400 కేజీల బంగారం స్వాధీనం చేసుకుంది.

విచారణ క్రమంలో సీబీఐ కస్టడీ నుంచి 103 కేజీల బంగారం మాయమైంది. ఆ 103కిలోల బంగారం ఏమైందో తేల్చాలన్న మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. సురానా గ్రూప్‌ రియల్‌ ఎస్టేట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు పవర్‌ సెక్టార్‌లో పెట్టుబడులు పెట్టడం గమనార్హం.