Italy | గ‌ర్ల్ ఫ్రెండ్‌కు.. రూ.900 కోట్ల వీలునామా రాసిన మాజీ ప్ర‌ధాని

Italy విధాత‌: గ‌త నెల‌లో చ‌నిపోయిన ఇటలీ మాజీ ప్ర‌ధాని త‌న స్నేహితురాలైన 33 ఏళ్ల మార్టా ఫాసినాకు సుమారు రూ.900 కోట్ల వీలు రాసిన‌ట్లు తాజాగా బ‌య‌ట‌ ప‌డింది. మూడు సార్లు ప్ర‌ధాని పీఠం అధిరోహించిన సిల్వియో బెర్లుస్కోనీకి సుమారు రూ. అయిదు వేల కోట్ల ఆస్తులున్నాయి. 2020 మార్చి నుంచి ఫాసినా, బెర్లుస్కోనీ రిలేష‌న్‌షిప్‌ లోకి వెళ్లారు గానీ వారు అధికారికంగా వివాహం చేసుకోలేదు. అయితే మ‌ర‌ణించే స‌మ‌యంలో ఆమెను త‌న భార్య‌గా బెర్లుస్కోని […]

  • By: Somu    latest    Jul 10, 2023 10:30 AM IST
Italy | గ‌ర్ల్ ఫ్రెండ్‌కు.. రూ.900 కోట్ల వీలునామా రాసిన మాజీ ప్ర‌ధాని

Italy

విధాత‌: గ‌త నెల‌లో చ‌నిపోయిన ఇటలీ మాజీ ప్ర‌ధాని త‌న స్నేహితురాలైన 33 ఏళ్ల మార్టా ఫాసినాకు సుమారు రూ.900 కోట్ల వీలు రాసిన‌ట్లు తాజాగా బ‌య‌ట‌ ప‌డింది. మూడు సార్లు ప్ర‌ధాని పీఠం అధిరోహించిన సిల్వియో బెర్లుస్కోనీకి సుమారు రూ. అయిదు వేల కోట్ల ఆస్తులున్నాయి. 2020 మార్చి నుంచి ఫాసినా, బెర్లుస్కోనీ రిలేష‌న్‌షిప్‌ లోకి వెళ్లారు గానీ వారు అధికారికంగా వివాహం చేసుకోలేదు.

అయితే మ‌ర‌ణించే స‌మ‌యంలో ఆమెను త‌న భార్య‌గా బెర్లుస్కోని పేర్కొన్నారు. ఆమె ప్ర‌స్తుతం ఇట‌లీ ప్ర‌భుత్వంలోనే ఫోర్జా ఇట‌లీ డిప్యుటీగా ఉండ‌టం విశేషం. ఇదిలా ఉండ‌గా మాజీ ప్ర‌ధానికి ఉన్న వ్యాపార సామ్రాజ్యానికి త‌న ఇద్ద‌రి బిడ్డ‌ల‌కు అప్ప‌గించారు. త‌న సోద‌రుడికి 100 మిలియ‌న్ యూరోలు, త‌మ పార్టీలోని మ‌రో నాయ‌కుడికి 30 మిలియ‌న్ యూరోలు ఇస్తున్న‌ట్లు విల్లులో పొందు ప‌రిచాడు.

మీడియా మొఘ‌ల్‌, బిజినెస్ టైకూన్‌, రాజ‌కీయ వేత్త‌గా బెర్లుస్కోనీ ప్ర‌సిద్ధి చెందారు. ఒకానొక ద‌శ‌లో ఆయ‌న త‌న‌ను తాను ఏసు ప్ర‌భువు అవ‌తారంగా ప్ర‌క‌టించుకున్నారు. మైన‌ర్ అమ్మాయిల‌తో బుంగా బుంగా అనే సెక్స్ పార్టీలు విరివిగా చేసుకుంటార‌ని బెర్లుస్కోనీపై ఆరోప‌ణ‌లున్నాయి