Jabardasth Shanthi Swaroop | స‌ర్జరీ కోసం సొంత ఇల్లు అమ్మాల్సి వ‌స్తుంది.. జ‌బ‌ర్ధ‌స్త్ శాంతి

Jabardasth Shanthi Swaroop | బుల్లితెర కామెడీ షోలో కొంద‌రు ఆర్టిస్ట్‌లు లేడి గెట‌ప్స్‌తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న విష‌యం తెలిసిందే. వారిలో శాంతి స్వ‌రూప్ ఒక‌రు. ఆయ‌న ఎప్ప‌టి నుండో జ‌బ‌ర్ధ‌స్త్‌తో పాటు ప‌లు కామెడీ షోస్‌లో త‌న కామెడీతో అల‌రిస్తూ ఉంటాడు. మంచి టాలెంట్ ఉన్న శాంతి స్వ‌రూప్.. జబర్దస్త్ షో చేస్తూనే, ఖాళీ స‌మ‌యాల‌లో సోష‌ల్ మీడియా ద్వారా కూడా వినోదం పంచే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. శాంతి స్వ‌రూప్‌కి సొంతంగా యూట్యూబ్ ఛానల్ […]

  • By: sn    latest    Aug 26, 2023 9:14 AM IST
Jabardasth Shanthi Swaroop | స‌ర్జరీ కోసం సొంత ఇల్లు అమ్మాల్సి వ‌స్తుంది.. జ‌బ‌ర్ధ‌స్త్ శాంతి

Jabardasth Shanthi Swaroop |

బుల్లితెర కామెడీ షోలో కొంద‌రు ఆర్టిస్ట్‌లు లేడి గెట‌ప్స్‌తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న విష‌యం తెలిసిందే. వారిలో శాంతి స్వ‌రూప్ ఒక‌రు. ఆయ‌న ఎప్ప‌టి నుండో జ‌బ‌ర్ధ‌స్త్‌తో పాటు ప‌లు కామెడీ షోస్‌లో త‌న కామెడీతో అల‌రిస్తూ ఉంటాడు.

మంచి టాలెంట్ ఉన్న శాంతి స్వ‌రూప్.. జబర్దస్త్ షో చేస్తూనే, ఖాళీ స‌మ‌యాల‌లో సోష‌ల్ మీడియా ద్వారా కూడా వినోదం పంచే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. శాంతి స్వ‌రూప్‌కి సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో తన లైఫ్ స్టోరీతో పాటు.. కాస్ట్యూమ్స్ డిజైన్స్, కామెడీకి సంబంధించిన అనేక విష‌యాలు పంచుకున్నారు. అలానే త‌న జీవితంలో ఎదుర్కొన్న ప‌రిస్థితులు గురించి కూడా చెప్పుకొచ్చారు.

అయితే ఎప్పుడు త‌న కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన శాంతి స్వరూప్ ఇప్పుడు చాలా క‌ష్ట‌ ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. త‌న తల్లికి తెలియకుండానే సొంతింటిని అమ్మేస్తున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పుకొచ్చారు. త‌న తల్లికి సర్జరీ చేయాల్సి ఉందని.. ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బులు లేక తాను ఈ నిర్ణ‌యం తీసుకోవ‌ల్సి వ‌చ్చింద‌ని శాంతి స్వ‌రూప్ అన్నారు.

అమ్మ స‌ర్జ‌రీ కోసం త‌న దగ్గర డ‌బ్బు లేక‌పోవ‌డంతో త‌ప్ప‌ని పరిస్థితుల‌లో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు చెప్పుకొచ్చాడు. అమ్మ‌కు ఈ విష‌యం తెలిస్తే అస్స‌లు ఒప్పుకోద‌ని అందుకే ఆమెకి తెలియ‌కుండా అమ్మాల‌ని అనుకుంటున్న‌ట్టు శాంతి స్వ‌రూప్ స్ప‌ష్టం చేశాడు.

శాంతి స్వ‌రూప్ పరిస్థితి తెలుసుకొని నెటిజన్స్ సైతం కన్నీరు పెట్టుకుంటున్నారు. శాంతి స్వరూప్ కు ధైర్యం చెబుతూ, ఆయ‌న‌కి మ‌ద్దుతుగా ఉంటూ ప‌లు కామెంట్లు చేస్తున్నారు. ఏ మాత్రం అధైర్యపడొద్దని, అమ్మగారు త్వ‌ర‌గానే కోలుకుంటారని శాంతి స్వ‌రూప్‌కి ధైర్యం చెబుతున్నారు. అమ్మ కోసం మీరు చేస్తున్న త్యాగం గొప్ప‌దంటూ కొంద‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఆయ‌న‌ని ఎవ‌రైనా ఆదుకోవాలంటూ రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్ వేసే ఆర్టిస్టులలో వినోదిని, జబర్దస్త్ శాంతి మాత్ర‌మే మంచి పేరు తెచ్చుకున్నారు . వినోదిని షో మానేసిన శాంతి స్వరూప్ మాత్రం ఇంకా షోలో కొనసాగుతూనే ఉన్నాడు. ఒక్క జబర్దస్త్ లోనే కాకుండా టీవీ షోస్, స్పెషల్ ఈవెంట్స్ చేస్తూ కొంత కూడ‌బెట్టుకుంటున్నాడు.