Vastu Tips | బెడ్రూమ్‌లో అద్దమా..? భార్యాభర్తలు ఆ కష్టాలు కొని తెచ్చుకున్నట్టే..!
Vastu Tips | చాలా మంది అద్దం( Mirror ) ముందే అధిక సమయం గడిపేస్తుంటారు. మరి ముఖ్యంగా కొత్తగా పెళ్లైన దంపతులు( Newly Married Couple ) అయితే అద్దం ముందే వాలిపోయి తమ అందాన్ని చూసుకుంటుంటారు. అదేదో హాల్‌లో కాకుండా బెడ్రూమ్( Bed Room )లోనే అద్దాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇది వాస్తు శాస్త్రానికి విరుద్ధమని వాస్తు నిపుణులు( Vastu Experts ) చెబుతున్నారు.
Vastu Tips | అద్దం( Mirror ) లేని ఇల్లు ఉండదు. ప్రతి ఇంట్లోనూ అద్దం ఉంటుంది. అదేదో ఒక్కటే ఉండదు.. హాల్‌లో, బెడ్రూమ్( Bed Room )లో, లివింగ్ రూమ్‌లో కూడా అద్దాలను ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇలా ఎక్కడంటే అక్కడ అద్దం ఏర్పాటు చేసుకోవడం మంచిది కాదని వాస్తు నిపుణులు( Vastu Experts ) చెబుతున్నారు. అద్దానికి కూడా వాస్తు నియమాలు( Vatu Tips ) ఉన్నాయని, ఏ దిశలో అద్దం ఉంచితే మంచిదో ఈ కథనంలో తెలుసుకుందాం.
అద్దానికి ఈ దిశ శుభప్రదం..
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఉత్తరం లేదా తూర్పు దిశ వైపున ఉన్న గోడకు అద్దాన్ని ఏర్పాటు చేసుకోవడం శుభప్రదమని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈ రెండు దిశల్లో అద్దాన్ని ఉంచడం వల్ల ఆ ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుందట. ప్రశాంత వాతావరణం కూడా ఏర్పడి.. దంపతులు అన్యోన్యంగా ఉంటారట. సంపద కూడా పెరుగుతుందట.
బెడ్రూమ్‌లో అద్దం అస్సలే వద్దట
ఇక చాలా మంది తెలియక బెడ్రూమ్‌లో అద్దాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇది వాస్తు శాస్త్రానికి విరుద్ధమని పండితులు చెబుతున్నారు. బెడ్రూమ్‌లో బెడ్ ముందు అద్దం ఉంచడం మూలంగా.. ఆ ఇంట్లో అశాంతి, మానసిక ఒత్తిడి పెరుగుతుందట. దాంపత్య జీవితంలో కూడా అనేక సమస్యలు ఏర్పడి కలహాలకు కారణమవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
లివింగ్ రూమ్‌లో అద్దం..
బెడ్రూమ్ కాకుండా లివింగ్ రూమ్‌లో అద్దాన్ని ఉంచడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఈ గదిలో మిర్రర్‌ను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందట. అంతేకాదు ఆ గది అందం కూడా పెరిగి.. పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి.. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram