Jabardasth Varsha | బిగ్‌బాస్‌-7లోకి ఎంట్రీ ఇవ్వనున్న జబర్దస్త్‌ వర్ష..! పెద్ద షోలో కనిపించబోతున్నానంటూ హింట్స్‌..!

Jabardasth Varsha | సీరియల్స్‌లో నటించి ఆ తర్వాత కామెడీ షో జబర్దస్‌ ద్వారా మంచి పాపులర్‌ అయ్యింది వర్ష. త్వరలో ప్రారంభంకానున్న తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌-7లో కనిపించనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే బిగ్‍బాస్ తెలుగు ఏడో సీజన్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్‌ విడుదల చేశారు. కానీ, కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ ఇంకా ఇప్పటి వరకు తెలియరాలేదు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్ష చేసిన కామెంట్లతో ఆమె బీబీ హౌస్‌లోకి వెళ్లనుందని తెలుస్తున్నది. సినిమాల్లో ఆఫర్లు […]

Jabardasth Varsha | బిగ్‌బాస్‌-7లోకి ఎంట్రీ ఇవ్వనున్న జబర్దస్త్‌ వర్ష..! పెద్ద షోలో కనిపించబోతున్నానంటూ హింట్స్‌..!

Jabardasth Varsha | సీరియల్స్‌లో నటించి ఆ తర్వాత కామెడీ షో జబర్దస్‌ ద్వారా మంచి పాపులర్‌ అయ్యింది వర్ష. త్వరలో ప్రారంభంకానున్న తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌-7లో కనిపించనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే బిగ్‍బాస్ తెలుగు ఏడో సీజన్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్‌ విడుదల చేశారు. కానీ, కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ ఇంకా ఇప్పటి వరకు తెలియరాలేదు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్ష చేసిన కామెంట్లతో ఆమె బీబీ హౌస్‌లోకి వెళ్లనుందని తెలుస్తున్నది.

సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయని, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానే అడుగుతున్నారని, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసేందుకు తనకు ఆసక్తి లేదని తెలిపింది. అయితే, త్వరలోనే ఓ పెద్ద షోలో కనిపించనున్నట్లు చెప్పింది. ఆ పెద్ద షో మరేదో కాదు బిగ్‌బాస్‌ అని అంచనా వేస్తున్నారు.

అయితే, బిగ్‌బాస్‌లో దాదాపు అన్ని సీజన్ల నుంచి జబర్దస్త్‌ నుంచి ఎవరో ఒకరు కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నారు. ఈ సారి 7వ సీజన్‌లోకి వర్ష ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా.. బిగ్‌బాస్‌-7కు సైతం హీరో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే అఫీషియల్‌ ప్రోమో సైతం విడుదలైంది. త్వరలోనే షో మొదలవనున్నట్లు తెలుస్తున్నది.

షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొన్నది ఇప్పటికే సోషల్‌ మీడియాలో పలువురి పేర్లు చెక్కర్లు కొడుతున్నాయి. టీవీ యాక్టర్ అమర్‌దీప్ చౌదరి, తేజస్విని గౌడ జంట బిగ్‍బాస్‌-7 లో పాల్గొనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అలాగే సింగర్‌ మోహన భోగరాజు, యూట్యూబర్ శ్వేతా నాయుడు, ఢీ షో ఫేమ్ దీపికా పిల్లి, యాంకర్ విష్ణు ప్రియ పేర్లు సైతం వినపడుతున్నాయి. సీనియర్ యాక్టర్ ప్రభాకర్ లేదంటే అతని తనయుడు బీబీ హౌస్‌లోకి కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంత వరకు నిజముందో త్వరలోనే తేలనున్నది.