Jack Dorsey | ట్విట్టర్‌ను మూసివేస్తామని.. దాడులు చేస్తామని హెచ్చరించారు.. భారత ప్రభుత్వంపై జాక్‌ డోర్సె సంచలన వ్యాఖ్యలు..!

Jack Dorsey | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్‌ మాజీ సీఈవో జాక్‌ డోర్సీ సంచలన ఆరోపణలు చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సరిగిన రైతు నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న అకౌంట్లను బ్లాక్‌ చేయాలని ట్విట్టర్‌కు అభ్యర్థనలు వచ్చాయని తెలిపారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం ట్విట్టర్‌ను ఒత్తిడికి గురి చేసిందని, అవసరమైతే ట్విట్టర్‌ను బ్లాక్‌ చేస్తామని, ఉద్యోగుల ఇండ్లపై రైడ్స్‌ నిర్వహిస్తామని బెదిరింపులు వచ్చాయని పేర్కొన్నారు. ట్విట్టర్‌ […]

Jack Dorsey | ట్విట్టర్‌ను మూసివేస్తామని.. దాడులు చేస్తామని హెచ్చరించారు.. భారత ప్రభుత్వంపై జాక్‌ డోర్సె సంచలన వ్యాఖ్యలు..!

Jack Dorsey | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్‌ మాజీ సీఈవో జాక్‌ డోర్సీ సంచలన ఆరోపణలు చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సరిగిన రైతు నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న అకౌంట్లను బ్లాక్‌ చేయాలని ట్విట్టర్‌కు అభ్యర్థనలు వచ్చాయని తెలిపారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం ట్విట్టర్‌ను ఒత్తిడికి గురి చేసిందని, అవసరమైతే ట్విట్టర్‌ను బ్లాక్‌ చేస్తామని, ఉద్యోగుల ఇండ్లపై రైడ్స్‌ నిర్వహిస్తామని బెదిరింపులు వచ్చాయని పేర్కొన్నారు. ట్విట్టర్‌ మాజీ బాస్‌ బ్రేకింగ్‌ పాయింట్స్‌ అనే ఓ యూట్యూబ్‌ చానెల్‌కు సోమవారం ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా విదేశీ ప్రభుత్వాల నుంచి ఏవైనా ఒత్తిళ్లు వచ్చాయా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. భారత్‌లో ప్రజాస్వామ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల నిరసన వస్తున్న సానుకూల ట్వీట్లను సామాజిక మాధ్యమం నుంచి తొలగించాలని భారత ప్రభుత్వం కోరింది. లేకపోతే ట్విటర్‌ను ఇండియాలో మూసివేస్తామని హెచ్చరించింది. అలాగే తమ ఉద్యోగుల ఇండ్లపై రైడ్స్‌ నిర్వహిస్తామని బెదిరించారని, రైడ్లు సైతం చేశారన్నారు.

‘ఇది భారతదేశం.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం’ అంటూ పరోక్షంగా విమర్శించారు. ఇదిలా ఉండగా.. ట్విట్టర్‌ను టేకోవర్‌ చేసిన అనంతరం ఎలాన్‌ మస్క్‌ సైతం భారత్‌లో సోషల్‌ మీడియా నిబంధనలపై సైతం కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 2021లో కేంద్రం తీసుకువచ్చిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రూల్స్‌పై విషయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయా నిబంధనలు కఠినమైనవని పేర్కొన్నారు.

ఉద్యోగులను జైలుకు పంపే ప్రమాదం కంటే.. ప్రభుత్వం నిరోధించే ఆదేశాలను తాను పాటించాలనని మస్క్‌ పేర్కొన్నారు. వాస్తవానికి 2020లో కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. 2020లో మొదలైన రైతు ఆందోళనలు 2021 నవంబర్‌ వరకు కొనసాగాయి.

రైతుల ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. రైతుల ఆందోళనకు సామాజిక మాధ్యమాల్లో దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. ఆందోళనకు దిగివచ్చిన కేంద్రం చివరకు రైతు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ట్విట్టర్‌ మాజీ సీఈవో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తీవ్రంగానే స్పందించారు.

డోర్సే వ్యాఖ్యలు అన్నీ అబద్ధాలని, భారత చట్టాలను పాటించాలని చెప్పినందుకు ఇలా మోసపూరితంగా ప్రవర్తించారని విమర్శించారు. ట్విట్టర్‌ను బ్యాన్‌ చేస్తామని తాము ఎలాంటి బెదిరింపులకు దిగలేదని ఆయన స్పష్టం చేశారు. భారతీయ చట్టాలకు లోబ‌డే విదేశీ కంపెనీలు ఉండాల‌న్న నిబంధ‌న‌ను ప్రభుత్వం పాటిస్తుందని చెప్పారు.

జ‌న‌వ‌రి 2021 స‌మ‌యంలో త‌ప్పుడు స‌మాచారం వ్యాప్తి జరిగిందన్న కేంద్రమంత్రి.. ఓ ద‌శ‌లో మార‌ణ‌ హోమం జ‌రిగిన‌ట్లు తప్పుడు వార్తలు వ్యాప్తి చెందాయన్నారు. ఫేక్‌ సమాచారాన్ని ట్విట్టర్‌ నుంచి తొలగించాలని ఆదేశించామని, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. జాక్‌ డోర్సే ట్విట్టర్‌ సీఈవోగా ఉన్న సమయంలోనే ఎక్కువ ఫేన్‌ న్యూస్‌ వ్యాప్తి చెందాయని విమర్శించారు. ఎవరిపై సోదాలు జరుగలేదని, ఎవరినీ జైలుకు పంపలేదని రాజీవ్‌ చంద్రశేఖర్‌ వివరించారు.