జగిత్యాల: ATM చోరీకి విఫలయత్నం.. రోడ్లపై చెల్లాచెదురుగా నోట్ల కట్టలు VIDEO

విధాత: జగిత్యాల జిల్లా కోరుట్ల లో ఏటీఎం నుంచి నగదు చోరీకి పాల్పడిన నిందితులు సినీ ఫక్కీలో పోలీసులకు దొరికిపోయారు. ఏటీఎంలో దొంగతనం చేసి రూ. లక్షల రూపాయల నగదుతో పారిపోతుండగా ఆ వాహనాన్ని పోలీస్‌ వాహనం డీకొట్టింది. దీంతో పారిపోతున్ననిందితులను తిరిగి పోలీస్‌ వాహనంవైపే వస్తున్నట్టు సీసీ కెమెరా ఫుటేజ్‌లో కనిపిస్తున్నది. ఆ సమయంలో నోట్ల కట్టలు గాల్లోకి ఎగిరపడ్డాయి. ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చోరీ ఘటనలకు సంబంధించి […]

  • By: krs    latest    Jan 15, 2023 2:48 PM IST
జగిత్యాల: ATM చోరీకి విఫలయత్నం.. రోడ్లపై చెల్లాచెదురుగా నోట్ల కట్టలు VIDEO

విధాత: జగిత్యాల జిల్లా కోరుట్ల లో ఏటీఎం నుంచి నగదు చోరీకి పాల్పడిన నిందితులు సినీ ఫక్కీలో పోలీసులకు దొరికిపోయారు. ఏటీఎంలో దొంగతనం చేసి రూ. లక్షల రూపాయల నగదుతో పారిపోతుండగా ఆ వాహనాన్ని పోలీస్‌ వాహనం డీకొట్టింది. దీంతో పారిపోతున్ననిందితులను తిరిగి పోలీస్‌ వాహనంవైపే వస్తున్నట్టు సీసీ కెమెరా ఫుటేజ్‌లో కనిపిస్తున్నది.

ఆ సమయంలో నోట్ల కట్టలు గాల్లోకి ఎగిరపడ్డాయి. ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చోరీ ఘటనలకు సంబంధించి పూర్త వివరాలు తెలియాల్సి ఉన్నది. వివరాల్లోకి వెళితే..

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నిన్న అర్దరాత్రి ఒంటి గంట సమయంలో ఎస్‌బీఐ బ్యాంక్‌ దగ్గర ఉన్న ఏటీఎంలో దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. చోరీ జరుగుతున్నదని అలారం ద్వారా తెలసుకున్న బ్యాంక్‌ సిబ్బంది డయల్‌ 100 ద్వారా కోరుట్ల ఎస్సై సతీశ్‌కు సమాచారం అందించింది.

విషయం తెలుసుకున్న ఎస్సై బ్లూ కోల్డ్‌ సిబ్బందిని అలర్ట్‌ చేశారు. తక్షణమే స్పందించిన బ్లూ కోర్టు సిబ్బంది ఏటీఎం నుంచి రూ. 19,00,200 డబ్బును దొంగతనం చేసి కారులో పారిపోతున్న నిందితులను అడ్డుకుని మనీ రికవరీ చేశారు. ఏటీఎం చోరీ నిందితుల కోసం జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.