Jailer | జైల‌ర్ ఫ‌న్నీ మీమ్.. మీరంతా క‌లిసి నన్ను భ‌లే మోసం చేశారంటూ ర‌జనీకాంత్ ఆవేద‌న‌

Jailer | సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం జైల‌ర్. ఆగ‌స్ట్ 10న విడుద‌లైన ఈ చిత్రం పెద్ద విజ‌యం సాధించింది. 500 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఇందులో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న‌ ర‌మ్య‌కృష్ణ న‌టించ‌గా, వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో నరసింహ చిత్రం వ‌చ్చింది. ఇది రజనీకాంత్ కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఇందులో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ తన విలక్షణ నటనతో ఎంత‌గానో ఆకట్టుకుంది. ఇక 'నరసింహ' తర్వాత […]

  • Publish Date - August 27, 2023 / 06:28 AM IST

Jailer |

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం జైల‌ర్. ఆగ‌స్ట్ 10న విడుద‌లైన ఈ చిత్రం పెద్ద విజ‌యం సాధించింది. 500 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఇందులో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న‌ ర‌మ్య‌కృష్ణ న‌టించ‌గా, వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో నరసింహ చిత్రం వ‌చ్చింది. ఇది రజనీకాంత్ కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచింది.

ఇందులో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ తన విలక్షణ నటనతో ఎంత‌గానో ఆకట్టుకుంది. ఇక ‘నరసింహ’ తర్వాత మళ్లీ వీళ్ళిద్దరి జోడి వెండితెరపై కనిపించలేదు. సుమారు 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ‘జైలర్’ సినిమాతో ప‌ల‌క‌రించారు. ఇందులో మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, బాలీవుడ్ న‌టుడు జాకీష్రాఫ్ కూడా ముఖ్య పాత్ర‌లు పోషించారు.

గ‌త మూడేళ్లుగా వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న ర‌జ‌నీకాంత్‌కి మంచి హిట్ ద‌క్కింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. సినిమా స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొంద‌రు మీమ‌ర్స్ ఫ‌న్నీ వీడియో ఒక‌టి క్రియేట్ చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఇది నెట్టింట వైర‌ల్ అవుతుంది.

చిత్రంలో ర‌మ్య‌కృష్ణ ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న న‌టించ‌గా, ఆమె గ‌తంలో మోహ‌న్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించి తెగ రొమాన్స్ పండించింది. దీంతో ర‌జ‌నీకాంత్ వారు ముగ్గురుని ఎదుటిగా నిలుచోపెట్టి నాకు అన్యాయం చేసిన‌ట్టు మాట్లాడ‌తాడు. ర‌జ‌నీకాంత్‌తో మోహన్ లాల్.. రమ్య‌కృష్ణ‌ నా చెల్లెలు లాంటిది అని చెప్ప‌గా, అప్పుడు వారిద్ద‌రు గ‌తంలో న‌టించిన సినిమాలోని రొమాన్స్‌కి సంబంధించిన క్లిప్ ప్లే అవుతుంది.

అది చూసిన ర‌జ‌నీకాంత్ అక్క‌లా, చెల్లెలా అమ్మలా అంటున్నారా అంటూ దండం పెడ‌తాడు. ప‌క్క‌న ఉన్న శివ‌రాజ్ కుమార్.. అరెయ్ ఏంట్రా అని అంటే అప్పుడు రజ‌నీకాంత్.. నా ల‌వ‌ర్‌కి నాక‌న్నా ముందే మీ అందరికి మెసేజ్ లు వ‌చ్చాయి. నేను మీకు ఇంట్ర‌డ్యూస్ చేసిన‌ప్పుడు తెలియ‌న‌ట్టు భ‌లే న‌టించారురా అంటాడు.

దానికి జాకీష్రాఫ్ కూడా షాకింగ్ రియాక్ష‌న్ ఇస్తాడు. ఆ స‌మ‌యంలోనే శివ‌రాజ్‌కుమార్ .. ర‌మ్య‌కృష్ణ‌తో రొమాన్స్ వీడియో, జాకీష్రాఫ్ వీడియోలు కూడా ప్లే అవుతాయి. ల‌వ్ టుడే డైలాగ్స్ ని జైల‌ర్ పాత్ర‌ల‌తో సింక్ చేసి భ‌లేకామెడీ పండించారు. ప్ర‌స్తుతం వీడియో అయితే నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Latest News