NTR 30 | అట్టహాసంగా ప్రారంభమైన కొరటాల, జాన్వీ, NTR సినిమా

విధాత‌: జూనియర్‌ ఎన్టీఆర్‌ 30వ సినిమా షూటింగ్‌ అట్టహాసంగా మొదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పూజా కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఎన్టీఆర్‌, కొరటాల శివ, జాన్వీకపూర్‌, ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు, సంగీత దర్శకుడు అనిరుధ్‌, నిర్మాత కల్యాణ్‌ రామ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూజా కార్యక్రమం అనంతరం నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఎన్టీఆర్‌-జాన్వీకపూర్‌పై చిత్రీకరించిన ముహూర్తపు […]

NTR 30 | అట్టహాసంగా ప్రారంభమైన కొరటాల, జాన్వీ, NTR సినిమా

విధాత‌: జూనియర్‌ ఎన్టీఆర్‌ 30వ సినిమా షూటింగ్‌ అట్టహాసంగా మొదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పూజా కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఎన్టీఆర్‌, కొరటాల శివ, జాన్వీకపూర్‌, ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు, సంగీత దర్శకుడు అనిరుధ్‌, నిర్మాత కల్యాణ్‌ రామ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూజా కార్యక్రమం అనంతరం నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఎన్టీఆర్‌-జాన్వీకపూర్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు జక్కన్న క్లాప్‌ కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

పూజా కార్యక్రమంలో అలనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్టీఆర్‌ తన అభిమాన నటుడని ఇప్పటికే ప్రకటించిన జాన్వీ.. ఎన్టీఆర్‌ను కలిసిన సందర్భంగా ఆనందంలో మునిగిపోయింది. ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఆ తర్వాత రాజమౌళితోనూ జాన్వీ కపూర్‌ మాట్లాడింది.

ఈ సందర్భంగా డైరెక్టర్‌ కొరటాల శివ మాట్లాడుతూ ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత నా సోదరుడు, ఈ జనరేషన్‌లో ఉన్న గొప్ప నటుల్లో ఒకరైన ఎన్టీఆర్‌తో కలిసి మరోసారి వర్క్‌ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత బ్యాక్‌డ్రాప్‌లో చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఈ కథలో మనుషుల కంటే ఎక్కువగా మృగాళ్లు ఉంటారన్నారు. భయం అంటే ఏమిటో వాళ్లకు తెలియదని, దేవుడన్నా, చావు అన్నా భయం ఉండదు కానీ.. వాళ్లకు ఒకే ఒక్కటంటే భయం ఉంటుంది.. ఆ భయమేంటో మీకు తెలిసే ఉంటుంది అన్నారు.

ఇదే ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌ అని చెప్పారు. భయపెట్టడానికి ప్రధాన పాత్ర ఏ స్థాయికి వెళ్తుందనేది.. ఒక ఎమోషనల్‌ రైడ్‌ అనీ, దీన్ని భారీ స్థాయిలో తీసుకు వస్తున్నామన్నారు. నా కెరీర్‌లో ఇది బెస్ట్‌ అవుతుందని అందరికీ మాటిస్తున్నానన్నారు కొరటాల శివ.