Telangana | మరో 16,940 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు
Telangana | తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. న్యూ ఇయర్ కానుక అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వివిధ కేటగిరిల్లో 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, మరో 16,940 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బీ జనార్ధన్ రెడ్డితో కలిసి పలు శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా […]

Telangana | తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. న్యూ ఇయర్ కానుక అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వివిధ కేటగిరిల్లో 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, మరో 16,940 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బీ జనార్ధన్ రెడ్డితో కలిసి పలు శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ మంగళవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ, మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్‌మెంట్ బోర్డుల ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఈ మేరకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఇటీవలే ఆర్థిక శాఖ జారీ చేసిన విషయం విదితమే. టీఎస్‌పీఎస్సీ ద్వారా 9,168 గ్రూప్-4 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రకటించారు. గ్రూప్-4తో పాటు గ్రూప్-2 నోటిఫికేషన్, గురుకులాల్లో టీచర్ల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది.
ఇక గ్రూప్-1, ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గ్రూప్ -1 మెయిన్స్‌కు సన్నాహాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో మెయిన్స్ నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇక ఎస్ఐ, కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది.