Joseph Manu James | తొలి సినిమా విడుదలకు ముందే యువ డైరెక్టర్ కన్నుమూత.. సినీ ఇండస్ట్రీలో విషాదం..!
Joseph Manu James | దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. తొలి చిత్రం విడుదలకు ముందే యువ డైరెక్టర్ ఆరోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచాడు. వివరాల్లోకి వెళితే.. జోసెఫ్ మను జేమ్స్ (31) అనే యువ డైరెక్టర్ ఆరోగ్య సమస్యలతో ఈ నెల 24న ఎర్నాకుళం జిల్లా అలువాలోని ఆసుప్రతిలో రాజగిరి ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో డైరెక్టర్‌కు పరీక్షలు నిర్వహించగా న్యుమోనియాతో బాధ పడుతున్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందగా.. మలయాళీ […]
Joseph Manu James | దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. తొలి చిత్రం విడుదలకు ముందే యువ డైరెక్టర్ ఆరోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచాడు. వివరాల్లోకి వెళితే.. జోసెఫ్ మను జేమ్స్ (31) అనే యువ డైరెక్టర్ ఆరోగ్య సమస్యలతో ఈ నెల 24న ఎర్నాకుళం జిల్లా అలువాలోని ఆసుప్రతిలో రాజగిరి ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు.
ఆసుపత్రిలో డైరెక్టర్‌కు పరీక్షలు నిర్వహించగా న్యుమోనియాతో బాధ పడుతున్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందగా.. మలయాళీ చిత్ర పరిశ్రమ షాక్‌కు గురైంది. విచారకరమైన విషయం ఏంటంటే.. జేమ్స్ తొలి చిత్రం ‘నాన్సీ రాణి’ త్వరలో విడుదలకు సిద్ధమైంది.
డైరెక్టర్ మృతిపై చిత్రబృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అహానా కృష్ణ తన ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్టర్ మృతికి సంతాపం ప్రకటించింది. ‘నాన్సీ రాణి’ సినిమాతో దర్శకుడిగా జేమ్స్ పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నది. చిత్రంలో అహానా కృష్ణ కుమార్, అర్జున్ అశోకన్, అజు వర్గీస్, శ్రీనివాసన్, ఇంద్రన్స్, సన్నీ వేన్, లేన్, లాల్ కీలకపాత్రలో పోషించారు.
జేమ్స్ మృతికి చిత్రబృందం కన్నీటి నివాళులర్పించింది. జేమ్స్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆదివారం మధ్యాహ్నం కురవిలంగాడ్ మేజర్ ఆర్కిపిస్కోపల్ మార్త్ మేరీ ఆర్చ్‌డీకాన్ చర్చిలో కుటుంబ సభ్యులు జేమ్స్ అంత్యక్రియలను నిర్వహించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram