Warangal | ఎమ్మెల్యే నన్నపునేని క్షమాపణ చెప్పాలి.. జర్నలిస్టుల ఆందోళన

వరంగల్ ప్రెస్ క్లబ్ లో నల్ల బ్యాడ్జీలతో నిరసన బహిరంగ క్షమాపణ చెప్పాలని జర్నలిస్టు సంఘాల డిమాండ్ 24 గంటల్లో స్పందించకుంటే ఆందోళన విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ (Warangal) తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆర్‌టీవీ ప్రతినిధి గుంటి విద్యాసాగర్ పట్ల అనుసరించిన అనుచిత వైఖరిని అన్ని జర్నలిస్టు యూనియన్లు, ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించాయి. తూర్పు ఎమ్మెల్యేతో ఇంటర్వ్యూ తీసుకుంటున్న క్రమంలో ఆదివారం జరిగిన ఈ సంఘటనకు నిరసనగా సోమవారం వరంగల్ ప్రెస్ […]

  • By: Somu    latest    Jun 19, 2023 10:48 AM IST
Warangal | ఎమ్మెల్యే నన్నపునేని క్షమాపణ చెప్పాలి.. జర్నలిస్టుల ఆందోళన
  • వరంగల్ ప్రెస్ క్లబ్ లో నల్ల బ్యాడ్జీలతో నిరసన
  • బహిరంగ క్షమాపణ చెప్పాలని జర్నలిస్టు సంఘాల డిమాండ్
  • 24 గంటల్లో స్పందించకుంటే ఆందోళన

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ (Warangal) తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆర్‌టీవీ ప్రతినిధి గుంటి విద్యాసాగర్ పట్ల అనుసరించిన అనుచిత వైఖరిని అన్ని జర్నలిస్టు యూనియన్లు, ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించాయి.

తూర్పు ఎమ్మెల్యేతో ఇంటర్వ్యూ తీసుకుంటున్న క్రమంలో ఆదివారం జరిగిన ఈ సంఘటనకు నిరసనగా సోమవారం వరంగల్ ప్రెస్ క్లబ్ వేదికగా జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

నిరసనకు ముందు ప్రెస్ క్లబ్ లో జరిగిన జర్నలిస్టు సంఘాల ప్రతినిధుల సమావేశంలో తూర్పు ఎమ్మెల్యే జర్నలిస్టు విద్యాసాగర్ పట్ల అనుసరించిన సంఘటన పై చర్చించారు. విద్యాసాగర్ సెల్ ఫోన్ లాక్కొని, ఆయనను అరగంట పాటు నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టు పట్ల అనుచితంగా ప్రవర్తించారని విమర్శించారు.

ఈ విషయమై 24 గంటల్లో ప్రెస్ క్లబ్ వేదికగా ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ దృష్టికి తీసుకపోవాలని నిర్ణయించారు. అయినప్పటికీ ఎమ్మెల్యే స్పందించకుంటే తదుపరి కార్యాచరణను తీవ్రం చేయాలని నిర్ణయించారు.

ఈ నిర్ణయంలో భాగంగానే ప్రెస్ క్లబ్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాలకు చెందిన అన్ని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, జర్నలిస్టులు భాగస్వామ్యం అయ్యారు.