Journalists Houses | జర్నలిస్టుల ఇండ్ల సమస్య కొలిక్కి.. త్వరలో JNJకు 70 ఎకరాల భూమి అప్పగింత

Journalists Houses 4 వేల మంది జర్నలిస్టల ఇంటి సమస్య పరిష్కారానికి 15 రోజుల్లో రోడ్‌ మ్యాప్‌ మంత్రి కేటీఆర్‌తో చర్చలు జరిపిన మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ విధాత: జర్నలిస్ట్‌ల ఇండ్ల స్థలాల సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. జర్నలిస్ట్‌లకు ఇండ్ల స్థలాల కేటాయింపు అంశంపై శుక్రవారం మంత్రి కేటీఆర్‌తో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ జెఎన్‌జె సొసైటీతో పాటు మిగతా జర్నలిస్టలందరికి […]

Journalists Houses | జర్నలిస్టుల ఇండ్ల సమస్య కొలిక్కి.. త్వరలో JNJకు 70 ఎకరాల భూమి అప్పగింత

Journalists Houses

  • 4 వేల మంది జర్నలిస్టల ఇంటి సమస్య పరిష్కారానికి 15 రోజుల్లో రోడ్‌ మ్యాప్‌
  • మంత్రి కేటీఆర్‌తో చర్చలు జరిపిన మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ

విధాత: జర్నలిస్ట్‌ల ఇండ్ల స్థలాల సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. జర్నలిస్ట్‌లకు ఇండ్ల స్థలాల కేటాయింపు అంశంపై శుక్రవారం మంత్రి కేటీఆర్‌తో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ జెఎన్‌జె సొసైటీతో పాటు మిగతా జర్నలిస్టలందరికి ఇంటి స్థలాలు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.

ఒకే దఫాలో హైదరాబాద్‌లో ఉన్న నాలుగు వేల మంది జర్నలిస్ట్‌లకు ఇంటి స్థలాలు ఇచ్చే దిశగా కసరత్తు చేస్తున్నామని, 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అల్లం నారాయణకు మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జవహర్‌ లాల్‌నెహ్రూ హౌసింగ్‌ సొసైటీకి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం70 ఎకరాల భూమిని స్వాధీనం చేయాలని మంత్రి కేటీఆర్‌ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.

పేట్ బషీరాబాద్ స్థలం విషయంలో ఎలాంటి అపోహలకు, అనుమానాలకు తావు లేదని ప్రభుత్వం తెలిపినట్టు తెలుస్తోంది. పేట్ బషీరాబాద్, నిజాంపేట్ భూములు జెఎన్‌జె హెచ్‌ఎస్‌(JNJHS) కు మాత్రమే చెందుతాయని కూడా హామీ ఇచ్చినట్టు సమాచారం. జూబ్లీహిల్స్ హౌసింగ్‌ సొసైటీలోని సభ్యులతో పాటు ఇతర అర్హులైన జర్నలిస్టులందరికీ తగిన న్యాయం చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు తెలిసింది. మొత్తం 4 వేలమంది జర్నలిస్ట్‌లకు ఒకేసారి ఇండ్ల స్థలాలను ఇవ్వాలని, దీనిని భారీ పండుగలాగా చేపట్టాలని మంత్రి అల్లం నారాయణకు చెప్పినట్లు సమాచారం.

సొసైటీ వెలుపలి జర్నలిస్టుల కోసం ప్రభుత్వ భూముల సేకరణ ప్రక్రియ ప్రారంభించినట్టు తెలియవచ్చింది. ఈ మేరకు మంత్రి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. జర్నలిస్ట్‌ల ఇండ్ల సమస్యను ఇక వాయిదా వేయరాదని పది, పదిహేను రోజుల్లోనే ఒక రోడ్ మ్యాపు తయారు చేసి, ముగింపు పలకడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, కేటీఆర్ చర్చల్లో వెల్లడయ్యినట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిపిన చర్చల వివరాలు, అకాడమీ సమర్పించిన నివేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంత్రి కేటీఆర్ చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. వాస్తవంగా ఈ భేటీ గురువారమే జరగాల్సి ఉన్నప్పటికీ సిద్ధిపేట ఐటి టవర్స్ ప్రారంభోత్సవం దృష్ట్యా ఈ చర్చలు శుక్రవారం జరిగాయని సమాచారం.