Jr NTR | సినిమా సినిమాకూ న్యూ లుక్‌తో కనిపించడం ఇప్పటి హీరోలకు మామూలే.. ఇలా కొత్తలుక్‌లో కనిపించడాన్ని ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సినిమా ఎలా ఉన్నా సరే.. తమ హీరో న్యూ లుక్‌లో కనిపించాలని కోరుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. ఇక కండలు తిరిగి బలిష్టంగా కనిపించే హీరో అంటే అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు ఇద్దరూ చాలా ఇష్టపడతారు. రాజమౌళి తీసిన బాహుబలి తరువాత హీరో కండలతో కనిపించడం అనేది ఈమధ్య కాలంలో […]
Jr NTR |
సినిమా సినిమాకూ న్యూ లుక్‌తో కనిపించడం ఇప్పటి హీరోలకు మామూలే.. ఇలా కొత్తలుక్‌లో కనిపించడాన్ని ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సినిమా ఎలా ఉన్నా సరే.. తమ హీరో న్యూ లుక్‌లో కనిపించాలని కోరుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. ఇక కండలు తిరిగి బలిష్టంగా కనిపించే హీరో అంటే అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు ఇద్దరూ చాలా ఇష్టపడతారు. రాజమౌళి తీసిన బాహుబలి తరువాత హీరో కండలతో కనిపించడం అనేది ఈమధ్య కాలంలో పరిపాటి అయిపోయింది.
ప్రభాస్ బాహుబలిలో తన టోటల్ లుక్ మారిపోయేట్టు తయారయ్యి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ అదే ట్రెండ్ ఫాలో అయ్యాడు. ఆ సినిమా ఏ లెవల్లో ఆడిందో అందరికీ తెలిసిందే. ఇప్పటి హీరోలు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. రీసెంట్గా ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రానికి కండలు పెంచే పనిలో పడ్డాడట. దీనికోసం విదేశాలకు వెళుతున్నాడనే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. విషయంలోకి వెళితే..
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో హిట్ దక్కించుకున్నాడు. అంతే కాకుండా దేశంలోని టాప్ ఐదుగురు హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఒకడిగా నిలిచాడు. ఈ సందర్భంగానే బాలీవుడ్ స్టార్ హీరోలతో ఎన్టీఆర్ జత కట్టేందుకు సైతం సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీ చేస్తున్నాడు.
ఈ మూవీ వచ్చే నవంబర్ నాటికి పూర్తికానుంది. ఈ మూవీ మొత్తంలో ఆరు భారీ ఫైట్స్‌తోపాటు 500మందితో ఓ సాంగ్ కూడా ఫ్లాన్ చేసారు. ఈ మూవీలో విలన్‌గా సైఫ్ ఆలీ ఖాన్ నటించబోతున్నాడట. 2024 సమ్మర్ సమయానికి ‘దేవర’ రిలీజ్ ఉండాలని కొరటాల ఆలోచన. దానికి తగినట్టే షూటింగ్ శరవేగంగా సాగుతుంది.
అయితే ఎన్టీఆర్ మరో ప్రాజెక్ట్ ‘వార్ 2’కు సంబంధించి ఎన్టీఆర్ భారీ ఆకారంతో కనిపించేందుకు కండలు పెంచాలని అమెరికా, దుబాయ్ ఈ రెండు ప్రదేశాల్లో ఏదో ఒకచోటికి వెళ్ళనున్నట్టు తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. స్పెషల్ ట్రైనర్స్ సమక్షంలో శిక్షణ తీసుకుని, వార్ 2కి సిద్ధం అవుతాడని అంటున్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే సంవత్సరం మొదలు కానుంది.
ఇందులో హృతిక్ రోషన్‌తో కాంబినేషన్ సీన్స్ ఉండటంతో పాటు.. భారీ విలన్స్‌తో పెద్ద ఆయుధాలను హ్యాండిల్ చేయాలట. అందుకే గన్ షూటింగ్ సమయంలో చేతి కండలు ప్రత్యేకంగా కనిపించేలా ఎన్టీఆర్ శరీరాన్ని మార్చుకోవాల్సి ఉంది. దీని కోసమే ఎన్టీఆర్ శిక్షణ తీసుకోనున్నాడని అంటున్నారు.
‘వార్ 2’ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకుడు. అతని దర్శకత్వంలో పఠాన్, వార్ మూవీస్ హిట్స్‌గా నిలిచాయి. నెక్ట్ రాబోతున్న ‘వార్ 2’ కూడా మంచి విజయం అందుకోబోతుందనేలా అప్పుడే టాక్ కూడా మొదలైంది. అందుకు కారణం ఎన్టీఆరే. ‘వార్’లో హృతిక్ రోషన్, టైగర్ ఫ్రాఫ్ నటించగా.. ‘వార్ 2’లో హృతిక్‌తో ఎన్టీఆర్ యాడ్ అవుతున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా ఉండనుంది.