50వ సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం

Justice DY Chandrachud | భారత అత్యున్నత న్యాయస్థానం 50వ చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ బుధవారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డీవై చంద్రచూడ్ చేత రాష్ట్రపతి భవన్ లో ప్రమాణం చేయించారు. డీవై చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ గా 2024, నవంబర్ 10వ తేదీ వరకు కొనసాగనున్నారు. జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ 74 రోజుల పాటు సీజేఐగా సేవలందించిన విషయం విదితమే. లలిత్ పదవీకాలం ముగియడంతో, ఆయన […]

50వ సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం

Justice DY Chandrachud | భారత అత్యున్నత న్యాయస్థానం 50వ చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ బుధవారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డీవై చంద్రచూడ్ చేత రాష్ట్రపతి భవన్ లో ప్రమాణం చేయించారు. డీవై చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ గా 2024, నవంబర్ 10వ తేదీ వరకు కొనసాగనున్నారు. జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ 74 రోజుల పాటు సీజేఐగా సేవలందించిన విషయం విదితమే. లలిత్ పదవీకాలం ముగియడంతో, ఆయన స్థానంలో చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించారు. సీజేఐ డీవై చంద్ర‌చూడ్ తండ్రి జ‌స్టిస్ వైవీ చంద్ర‌చూడ్ కూడా 44 ఏండ్ల క్రితం భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా సేవలందించారు. జ‌స్టిస్ వైవీ చంద్ర‌చూడ్ అత్య‌ధికంగా ఏడేళ్ల పాటు సీజేఐగా చేశారు.

1998 నుంచి 2000 వ‌ర‌కు అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌గా జ‌స్టిస్ చంద్ర‌చూడ్ సేవలందించారు. 1998లో బాంబే హైకోర్టులో ఆయ‌న సీనియ‌ర్ అడ్వ‌కేట్‌గా న‌మోదు అయ్యారు. పౌర, మ‌త‌, భాషాప‌ర‌మైన‌ హ‌క్కుల‌తో పాటు అనేక కేసుల్లో ఆయ‌న వాదించారు. 2000, మార్చి 29న బాంబే హైకోర్టులో అద‌న‌పు జ‌డ్జిగా నియ‌మితుల‌య్యారు. 2013, అక్టోబ‌ర్ 31న ఆయ‌న అల‌హాబాద్ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా అపాయింట్ అయ్యారు. 2016, మే 13వ తేదీన సుప్రీంకోర్టు జ‌డ్జిగా నియామకం అయ్యారు.

జ‌స్టిస్ చంద్ర‌చూడ్ 1959, న‌వంబ‌ర్ 11న జ‌న్మించారు. 1979లో ఆయ‌న ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకానమిక్స్ లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. 1982లో ఢిల్లీ యూనివ‌ర్సిటీ నుంచి ఎల్ఎల్‌బి పట్టా పొందారు. 1983లో హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో ఎల్ఎల్ఎమ్ పూర్తి చేశారు. 1986లో హార్వ‌ర్డ్ నుంచే జురిడిక‌ల్ సైన్సెస్‌లో(ఎస్జేడీ) డాక్ట‌ర్ ప‌ట్టా పొందారు.