Telangana Highcourt | తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జ‌స్టిస్ న‌వీన్ రావు.. ఈ ఒక్క‌రోజే ఆ బాధ్య‌త‌ల్లో..

Telangana Highcourt | తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ పొనుగోటి న‌వీన్ రావు శుక్ర‌వారం ఒక్క రోజు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర న్యాయ‌శాఖ గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. నిన్న‌టి వ‌ర‌కు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా కొన‌సాగిన జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్.. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌దోన్నతి పొందిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆ బాధ్య‌త‌ల‌ను అత్యంత సీనియ‌ర్ జ‌డ్జి అయిన జస్టిస్ న‌వీన్‌కు కేంద్ర న్యాయ శాఖ అప్ప‌గించింది. అయితే న‌వీన్ […]

Telangana Highcourt | తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జ‌స్టిస్ న‌వీన్ రావు.. ఈ ఒక్క‌రోజే ఆ బాధ్య‌త‌ల్లో..

Telangana Highcourt |

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ పొనుగోటి న‌వీన్ రావు శుక్ర‌వారం ఒక్క రోజు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర న్యాయ‌శాఖ గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. నిన్న‌టి వ‌ర‌కు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా కొన‌సాగిన జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్.. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌దోన్నతి పొందిన విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఆ బాధ్య‌త‌ల‌ను అత్యంత సీనియ‌ర్ జ‌డ్జి అయిన జస్టిస్ న‌వీన్‌కు కేంద్ర న్యాయ శాఖ అప్ప‌గించింది. అయితే న‌వీన్ రావు శుక్ర‌వారం రోజే ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నుండ‌డంతో.. ఈ ఒక్క‌రోజే తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఆ ప‌ద‌విలో కొన‌సాగుతారు. శ‌నివారం నుంచి సీనియారిటీ జాబితాలో ముందు వ‌రుస‌లో ఉన్న జ‌స్టిస్ అభినంద్ కుమార్ షావిలి తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు.

ఇక జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌దోన్నతి ల‌భించిన నేప‌థ్యంలో తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా క‌ర్ణాట‌క హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అలోక్ అరాధే పేరును సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 5న కేంద్రానికి సిఫార‌సు చేసింది. జ‌స్టిస్ అలోక్ నియామ‌కానికి రాష్ట్ర‌ప‌తి ఇంకా ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.