జ్యోతిక కర్ర తిప్పుడు చూస్తే.. అవాక్కవ్వాల్సిందే

JYOTHIKA, SURIYA విధాత: హీరోయిన్లు అంటే కేవలం పాటలు, లవ్ సీన్స్‌కే పనికి వస్తారని అందరూ భావిస్తారు కానీ.. నయనతార, విజయశాంతి, అనుష్క వంటి వారు యాక్షన్ సీన్స్‌లో కూడా నటించి మెప్పించారు. వారు సినిమా రంగంలోకి రాకముందు యాక్షన్ సీన్స్‌కు అవసరమైన గుర్రపు స్వారీ, కర్ర సాము, ఇతర విలు విద్యల‌ను నేర్చుకుంటారు కానీ.. వాటిని ప్రదర్శించే అవకాశం ఎప్పుడోగానీ వారికి దక్కదు. కొంతకాలంగా హీరోయిన్లతో యాక్షన్ సినిమాలు తీసేందుకు కూడా మేకర్స్ పెద్ద పీట […]

  • By: krs    latest    Feb 26, 2023 4:39 PM IST
జ్యోతిక కర్ర తిప్పుడు చూస్తే.. అవాక్కవ్వాల్సిందే

JYOTHIKA, SURIYA

విధాత: హీరోయిన్లు అంటే కేవలం పాటలు, లవ్ సీన్స్‌కే పనికి వస్తారని అందరూ భావిస్తారు కానీ.. నయనతార, విజయశాంతి, అనుష్క వంటి వారు యాక్షన్ సీన్స్‌లో కూడా నటించి మెప్పించారు. వారు సినిమా రంగంలోకి రాకముందు యాక్షన్ సీన్స్‌కు అవసరమైన గుర్రపు స్వారీ, కర్ర సాము, ఇతర విలు విద్యల‌ను నేర్చుకుంటారు కానీ.. వాటిని ప్రదర్శించే అవకాశం ఎప్పుడోగానీ వారికి దక్కదు.

కొంతకాలంగా హీరోయిన్లతో యాక్షన్ సినిమాలు తీసేందుకు కూడా మేకర్స్ పెద్ద పీట వేస్తుండడంతో హీరోయిన్స్ ఫైట్స్ చేస్తూ ప్రేక్షకుల్ని, ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేస్తున్నారు. వారి యాక్షన్ సీన్స్‌ను చూసి అందరూ ఆహా ఓహో అనుకునేలా చేస్తున్నారు. శృతిహాసన్, సమంత ఇటీవల యాక్షన్‌లోకి దిగిన విషయం తెలిసిందే. అయితే రీల్ వరకు ఓకే గానీ.. రియల్ లైఫ్ విషయం మాత్రం కొందరే ఘట్స్ ప్రదర్శిస్తుంటారు.

ఇప్పుడా జాబితాలోకి సూర్య వైఫ్, నటి జ్యోతిక చేరింది. తాజాగా హీరోయిన్ జ్యోతిక క‌ర్ర సాముతో ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేసింది. సాధారణంగా క‌ర్రసాము వంటివి హీరోలు చేస్తూ ఉంటారు.. అది కూడా నిపుణుల పర్యవేక్షణలో చేస్తారు. కానీ జ్యోతిక మాత్రం ప‌ర్య‌వేక్ష‌కుల‌తో ప‌ని లేకుండానే వాటిని స్టేజీల‌పై ప్ర‌ద‌ర్శిస్తోంది.

ఇటీవల ఆమె ఓ స్టేజ్‌పైన కర్రసాము చేసింది. ఈ వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి తెలుగు, తమిళ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయినా సరే.. మంచి ఈజ్‌తో కర్రసాము చేస్తోందని ఈ వీడియో చూసిన వారు జ్యోతికపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.