ఆగ‌ని సూర్య-జ్యోతిక విడాకుల ప్ర‌చారాలు.. వారిద్ద‌రు ముంబైలో విడిగి ఉంటున్నారా..!

ఆగ‌ని సూర్య-జ్యోతిక విడాకుల ప్ర‌చారాలు.. వారిద్ద‌రు ముంబైలో విడిగి ఉంటున్నారా..!

ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీల విడాకుల వార్త‌లు ఎక్కువ‌గా వింటున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న సెల‌బ్స్ సైతం వైవాహిక బంధానికి మ‌ధ్య‌లోనే బ్రేక్ వేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఈ విడాకుల వ్య‌వ‌హారం చాలా ఎక్కువైపోయింది. స‌మంత‌- నాగ చైత‌న్య జంట త‌ర్వాత ధ‌నుష్‌- ఐశ్వ‌ర్య విడాకుల విష‌యం పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఇక ఇప్పుడు సూర్య జ్యోతిక విడాకులు తీసుకున్నారంటూ జోరుగా రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. ఇవి గ‌త కొద్ది రోజులుగా వినిపిస్తుండ‌గా, కొంద‌రు వాటిని లైట్ కూడా తీసుకున్నారు. అయితే మరోసారి వీరి విడాకులు న్యూస్ వైరల్ అయ్యింది.

ఆ మ‌ధ్య సూర్య‌, జ్యోతిక మ‌ధ్య గొడ‌వ‌లు అయ్యాయ‌ని, కుటుంబాల‌కి దూరంగా ముంబైలో ఉంటున్నార‌ని ప్ర‌చారాలు సాగాయి. దానిపై క్లారిటీ ఇచ్చిన కార్తి.. పిల్లల చదువుల కోసం వారు ముంబై వెళ్లార‌ని క్లారిటీ కూడా ఇచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరికి పడటం లేదట. మనస్పర్ధల కారణంగా వీరు ముంబయ్ లో విడిగా ఉంటున్నట్టుప్ర‌చారం జ‌రుగుతుంది. పిల్లల చదువుకోసం మాత్రమే సూర్య ముంబైలో ఉంటుండ‌గా, జ్యోతిక ప్రాపర్ ముంబయే కాబట్టి.. ఆమె అక్కడ ఉంటుంది. ఇక సూర్య షూటిగ్ కోసం చెన్నై వెళ్ళి వ‌స్తున్నాడ‌ని ప్ర‌చారం న‌డుస్తుంది. ప్ర‌స్తుతం ఈ రూమ‌ర్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుండ‌గా, ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

స్టార్ కపుల్స్ సూర్య – జ్యోతిక ఎన్నో ఏళ్ల నుండి చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. వారి జంట‌పై ఎలాంటి ట్రోలింగ్ జ‌ర‌గ‌లేదు. ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంటున్న ఈ జంట తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఎన్నో చిత్రాల్లో నటించారు. ఇటీవ‌ల జ‌రుగుతున్న ప్ర‌చారాల‌పై జ్యోతిక స్పందిస్తూ.. నాకు, సూర్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. సూర్య చాలా సిన్సియర్ పర్సన్. మా ఇద్దరికీ విడాకులు తీసుకునే ఆలోచన కూడా లేదు. మా అమ్మానాన్నలు ముంబైలో ఉంటుండ‌గా, వారికి ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డం వ‌ల‌న సూర్య న‌న్ను ఇక్క‌డికి పంపించాడు. అత‌ను ఎంత మంచివాడ‌నేది ఇంత‌కు మించిన ఉదాహ‌ర‌ణ అక్క‌ర్లేదు అని పుకార్ల‌కి పులిస్టాప్ పెట్టే ప్ర‌య‌త్నం చేసింది జ్యోతిక‌.