మునుగోడు యువతకు KA పాల్ బంఫర్ ఆఫర్.. ఉచితంగా పాస్‌పోర్టు, అమెరికా వీసా..!

విధాత‌: మునుగోడు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంఫర్ ఆఫర్ ప్రకటించారు. తన 59వ జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని 59 మంది నిరుద్యోగులను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి.. వారికి పాస్ పోర్ట్, అమెరికా వీసా ఉచితంగా ఇప్పించనున్నట్లు ప్రకటించారు. బీసీ కుటుంబంలో పుట్టి దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్న నాకు.. నిరుద్యోగుల కష్టాలు ఎలా ఉంటాయో తెలుసున‌ని, ఇందుకోసం నేను ఎలాంటి డబ్బులు తీసుకోవడం లేదన్నారు. ఇంటికో ఉద్యోగం […]

  • By: Somu    latest    Sep 20, 2022 11:11 AM IST
మునుగోడు యువతకు KA పాల్ బంఫర్ ఆఫర్.. ఉచితంగా పాస్‌పోర్టు, అమెరికా వీసా..!

విధాత‌: మునుగోడు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంఫర్ ఆఫర్ ప్రకటించారు. తన 59వ జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని 59 మంది నిరుద్యోగులను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి.. వారికి పాస్ పోర్ట్, అమెరికా వీసా ఉచితంగా ఇప్పించనున్నట్లు ప్రకటించారు.

బీసీ కుటుంబంలో పుట్టి దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్న నాకు.. నిరుద్యోగుల కష్టాలు ఎలా ఉంటాయో తెలుసున‌ని, ఇందుకోసం నేను ఎలాంటి డబ్బులు తీసుకోవడం లేదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ముఖ్యమంత్రి, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధాని మోదీ యువతను మోసం చేశార‌ని పాల్ అన్నారు. తన జన్మదిన కానుకగా అందిస్తున్న అవకాశాన్ని మునుగోడు యువత ఉపయోగించుకోవాలని కేఏ పాల్ కోరారు.

కేఏ పాల్‌కు ఈసీ ఝలక్ !

అయితే.. కేఏ పాల్‌కు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రజాశాంతి పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. క్రియాశీలకంగా లేని పార్టీల జాబితాలో ప్రజాశాంతి పార్టీని చేర్చింది. 2019లో ఏపీకే పరిమితమైన కేఏ పాల్ తనకు అవకాశం ఇవ్వాలని హంగామా చేశారు.

ఇక తాజాగా తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక తెలంగాణాలోనూ ప్రత్యామ్నాయం నేనే అని రచ్చ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేంద్రంలోనూ కీలకపాత్ర పోషించ బోతున్నామని పాల్ తాజాగా ప్రకటించారు. ఈ క్రమంలో ఈసీ ఆయనకు ఝలక్ ఇచ్చింది.

ప్రజాశాంతి పార్టీని 2008లో రిజిస్టర్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 2009 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని పాల్ ప్రకటించటంతో ఈసీ ఆ పార్టీకి హెలికాప్టర్ గుర్తును కేటాయించింది. 2019లో ప్రజాశాంతి పార్టీ నుంచి 11 మంది పోటీ చేశారు. కానీ ఎవరూ గెలవలేదు. ఇక గెలుపు విషయానికి వస్తే.. పాల్ పార్టీకి కనీసం ఒకటి, రెండు స్థానాల్లో కూడా అభ్యర్థులు లేరు. అప్పుడు కేఏ పాల్ పార్టీకి కేవలం నాలుగు వేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి.