MUNUGODE: తీన్మార్‌ స్టెప్పులేసిన KA పాల్‌

విధాత: మునుగోడు ప్రచారంలో ప్రధాన పార్టీల అభర్టులకు మద్దతుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఆయా పార్టీల అధ్యక్షులు వస్తున్నారు. ప్రజలకు వాళ్ళ నుంచి ఎంత ఆదరణ వస్తున్నదో ప్రజా శాంతి పార్టీ అభ్యర్థిగా అక్కడ బరిలో ఉన్న కేఏ పాల్ కూడా క్రేజ్ మామూలుగా లేదు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలీలో దూసుకు పోతున్నారు. ఓటర్లను ఆకట్టునేందుకు ప్రయత్నిస్తున్నారు. మునుగోడు ప్రజలతో కలిసి నృత్యం చేసి […]

  • By: krs    latest    Oct 25, 2022 1:22 PM IST
MUNUGODE: తీన్మార్‌ స్టెప్పులేసిన KA పాల్‌

విధాత: మునుగోడు ప్రచారంలో ప్రధాన పార్టీల అభర్టులకు మద్దతుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఆయా పార్టీల అధ్యక్షులు వస్తున్నారు. ప్రజలకు వాళ్ళ నుంచి ఎంత ఆదరణ వస్తున్నదో ప్రజా శాంతి పార్టీ అభ్యర్థిగా అక్కడ బరిలో ఉన్న కేఏ పాల్ కూడా క్రేజ్ మామూలుగా లేదు.

మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలీలో దూసుకు పోతున్నారు. ఓటర్లను ఆకట్టునేందుకు ప్రయత్నిస్తున్నారు. మునుగోడు ప్రజలతో కలిసి నృత్యం చేసి అలరించారు. ప్రజాశాంతి పార్టీ గీతానికి స్టెప్పులేశారు.

ఆయన ప్రచారం చేస్తున్న హడావిడితో నిత్యం మీడియాలో, సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా యువత ఆయన మాటలను, ఆయన హావభావాలను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మునుగోడులో ఆయన పాటకు స్టెప్పులు వేస్తుంటే ఈలలు వేస్తున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాస్ సాంగ్స్ కి ఊర మాస్ స్టెప్పులు వేసి అందరి దృష్టిని ఆకర్శించారు.