KA పాల్: కామెడీ కాదు సీరియస్.. వారి బాణమేనా!
విధాత: నేను ఒక్క వారం అమెరికాకు వెళ్తే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ వాపోయారు. దీనిపై సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్ చేస్తున్నారు. మనమూ దానిని కామెడీ గానే చూస్తు కాసేపు నవ్వుకుంటాం కానీ ఆతను వ్యాఖ్యలు, చేస్టల వెనకాల కూడా కొన్ని ఆదృశ్య శక్తులు ఉంటాయనే విషయాన్ని సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంటది. అయితే షర్మిల బీజేపీ వదిలిన బాణమని, అధికార పార్టీ నేతలు మొదలు […]

విధాత: నేను ఒక్క వారం అమెరికాకు వెళ్తే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ వాపోయారు. దీనిపై సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్ చేస్తున్నారు. మనమూ దానిని కామెడీ గానే చూస్తు కాసేపు నవ్వుకుంటాం కానీ ఆతను వ్యాఖ్యలు, చేస్టల వెనకాల కూడా కొన్ని ఆదృశ్య శక్తులు ఉంటాయనే విషయాన్ని సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంటది. అయితే షర్మిల బీజేపీ వదిలిన బాణమని, అధికార పార్టీ నేతలు మొదలు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఆరోపించారు.
అయితే కేఏ పాల్ మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రాక ముందు బీజేపీ అగ్ర నేతలతో భేటీ అయిన విషయాన్ని మరువరాదు. అంతేకాదు ఆయన సొంత రాష్ట్రం ఏపీలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉన్న ఆయన అకస్మాత్తుగా మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచి ప్రచారంలో చాలా విన్యాసాలు చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆయన ఎందుకు మునుగోడులో నిలబడ్డారన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయర కూడా ఓట్ల చీలిక కోసం బీజేపీ వదిలిన బాణమేనని సర్వత్రా చర్చ నడుస్తున్నది.
ఇక అసలు విషయం ఏమిటి అంటే తాను రాష్ట్రంలో వారం లేకపోతే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారనే మాట ను కూడా తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్ర గవర్నర్ కాదు, సీఎం కాదు, కనీసం శాంతభద్రతలు కాపాడే రాష్ట్ర హోమ్ మంత్రి కూడా కాదు. కానీ తనకు తానే తెలంగాణ రాష్ట్రానికి రక్షకుడిగా.. పాలకుడిగా సర్టిఫికెట్లు ఎలా ఇచ్చుకుంటున్నరు? అన్నది ఆలోచించాలి.
రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఢిల్లీకి మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత వివరణ కోసం సీబీఐ నోటీసులు, షర్మిల పాదయాత్ర రభస వంటివి సీరియస్ చర్చ జరుగుతుండగా పాల్ ఎంట్రీ ఎందుకు? అయన చేసిన వ్యాఖ్యలు ఏమిటి?అనే చర్చ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నది.