Shefali Jariwala | ఆ వ్యాధితో పదేళ్లు ఎన్నో కష్టాలు పడ్డా..! ‘కంటా లగా’ బ్యూటీ షెఫాలీ జరివాలా
Shefali Jariwala | సినిమా ఓ రంగుల ప్రపంచం. వెండితెరపై కనిపిస్తే సెలబ్రెటీ హోదా వచ్చిపడుతుంది. దాంతో చాలా మంది ఎంతో ఉన్నత జీవితం ఉంటుందని, వారికి ఎలాంటి కష్టాలు బాధలుండవని అందరూ అనుకుంటారు. కానీ, తెరపై కనిపించే నటీనటులకు కూడా కన్నీళ్లు, బాధలుంటాయి. ఇటీవల ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. పలువురు ఆరోగ్య సమస్యలతో పాటు ఎన్నో పరాభావాలను వెల్లడించారు. టాలీవుడ్ బ్యూటీ సమంత నుంచి ఎంతో మంది ఇప్పటి వరకు పలువురు నటీమణులు […]

Shefali Jariwala | సినిమా ఓ రంగుల ప్రపంచం. వెండితెరపై కనిపిస్తే సెలబ్రెటీ హోదా వచ్చిపడుతుంది. దాంతో చాలా మంది ఎంతో ఉన్నత జీవితం ఉంటుందని, వారికి ఎలాంటి కష్టాలు బాధలుండవని అందరూ అనుకుంటారు. కానీ, తెరపై కనిపించే నటీనటులకు కూడా కన్నీళ్లు, బాధలుంటాయి. ఇటీవల ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. పలువురు ఆరోగ్య సమస్యలతో పాటు ఎన్నో పరాభావాలను వెల్లడించారు. టాలీవుడ్ బ్యూటీ సమంత నుంచి ఎంతో మంది ఇప్పటి వరకు పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలను పలు సందర్భాల్లో తెలిపారు.
తాజాగా ఒక్క వీడియో ఆల్బమ్‌తో ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగిన షెఫాలీ జరివాలా సైతం తన బాల్యంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించింది. షఫాలీ జరివాలా 2002లో వచ్చిన ‘కాంటా లగా’ వీడియో సాంగ్‌తో మంచి గుర్తింపు తెచ్చింది. ఈ పాటతో కోట్లాది మందిని అలరించింది. 1975లో వచ్చిన పాటకు రిమిక్స్‌గా తెరకెక్కించిన వీడియో సాంగ్‌లో షెఫాలీ జరివాలా మత్తెక్కించే అందాలతో కుర్రాళ్లకు కైపెక్కించింది. ఆ తర్వాత పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ పని చేసింది. 2019-20లో బిగ్‌బాస్-13 సీజన్‌లోనూ పాల్గొన్నది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షెఫాలీ జరివాలా తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నది. 15 ఏళ్ల వయసులో మూర్ఛ వ్యాధి వచ్చిందని, హఠాత్తుగా మూర్ఛతో కిందపడిపోతే చాలా మంది విచిత్రంగా చూసేవారని, ఆ వ్యాధి తనను పదేళ్ల పాటు వెంటాడిందని తెలిపింది. మూర్ఛ వ్యాధితో జీవించడం ఓ చాలెంజ్ అని, మూర్ఛ కారణంగా ఒక్కోసారి ఒంటరిగా జనాల్లోకి వెళ్లేందుకు భయపడేదాన్ని ఆవేదన వ్యక్తం చేసింది. జీవితంలో ఎదుగుతున్న సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, ఎక్కడ పడితే అక్కడికి, ఎప్పుడు పడితే అప్పుడు హఠాత్తుగా మూర్ఛ వచ్చి పడిపోతానేమోనని భయపడేదాన్నని, చాలా ఒత్తిడికి గురైనట్లు చెప్పింది.
కాంటా లగా షూటింగ్ చేస్తున్న సమయంలోనూ సడెన్‌గా మూర్ఛ వస్తుందేమోనని తెగ భయపడ్డానని, కానీ ప్రస్తుతం పరిస్థితులు అన్నీ చక్కదిక్కున్నాయని వివరించింది. మందులతో ఆరోగ్యం మెరుగైందని, గత పదిహేనేళ్లుగా మూర్ఛ రావడం లేదని తెలిపింది. మానసికంగా, శారీరకంగా ప్రస్తుతం దృఢంగా ఉన్నానని షెఫాలీ వెల్లడించింది. సల్మాన్, అక్షయ్ నటించిన ‘ముజ్‌సే షాదీ కరోజి’ బాలీవుడ్‌తో చిత్రంతో పాటు 2011లో కన్నడ చిత్రం ‘హుడుగరు’ చిత్రంలో బాలీవుడ్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత డ్యాన్స్ రియాల్టీ షో నాచ్ బలియే 5, 7 సీజన్స్‌లోనూ కనిపించింది.