కాళేశ్వరం పంపు హౌస్ కూలినా ప‌ట్ట‌ని ముఖ్యమంత్రి: ఈట‌ల

గ‌త ప్రాజెక్టుల‌ను గాలికొదిలేయ‌డంతో రైతుల‌కు తీవ్ర న‌ష్టం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే నీచమైన సంస్కృతిని ప్రారంభించింది అత‌నే.. విధాత: సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అద్భుతాన్ని చేశాన‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్నారు.. కానీ కల్నేపల్లి పంప్ హౌస్ మునిగిపోయి గోడలు కూలిపోయినా త‌న‌కే సంబంధం లేదన్న‌ట్టు బాధ్య‌తార‌హితంగా వ్య‌వ‌హరిస్తున్నార‌ని బీజేపీ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. డిండి మండలం చెరుకుపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ విగ్రహాల ప్రతిష్ట కార్య‌క్ర‌మాకు ముఖ్యఅతిథిగా హాజరయిన […]

కాళేశ్వరం పంపు హౌస్ కూలినా ప‌ట్ట‌ని ముఖ్యమంత్రి: ఈట‌ల
  • గ‌త ప్రాజెక్టుల‌ను గాలికొదిలేయ‌డంతో రైతుల‌కు తీవ్ర న‌ష్టం
  • ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే నీచమైన సంస్కృతిని ప్రారంభించింది అత‌నే..

విధాత: సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అద్భుతాన్ని చేశాన‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్నారు.. కానీ కల్నేపల్లి పంప్ హౌస్ మునిగిపోయి గోడలు కూలిపోయినా త‌న‌కే సంబంధం లేదన్న‌ట్టు బాధ్య‌తార‌హితంగా వ్య‌వ‌హరిస్తున్నార‌ని బీజేపీ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు.

డిండి మండలం చెరుకుపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ విగ్రహాల ప్రతిష్ట కార్య‌క్ర‌మాకు ముఖ్యఅతిథిగా హాజరయిన ఈట‌ల‌ ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. కన్నెపల్లి పంప్ హౌస్ మునిగి ఆరు నెలలు కావస్తున్నా మరమ్మతులు లేవని, మీడియాని సైతం పంప్ హౌస్ వద్దకు వెళ్ల‌నివ్వడం లేదని ఆరోపించారు.

గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు, రైతులకు నష్టం జరుగుతుందన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రాజెక్టులు నేడు ఏ ఒక్కటి కూడా కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు.

ఎస్ఎల్‌బీసీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులే ఇందుకు నిదర్శనమన్నారు. నెట్టెంపాడు, కల్వకుర్తి చెరువులకు నీళ్లు మాటలకే పరిమితమయ్యాయన్నారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కీలకంగా ఉన్న డిండి ఎత్తిపోతల పనులకు అతీగతీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే నీచమైన సంస్కృతిని కేసీఆర్ ప్రభుత్వం చేస్తుందన్నారు. ప్రజాప్రతినిధులు లొంగకపోతే పోలీసులతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.