Kalki 2898 AD | చాగంటి వారు చేసిన ‘కల్కి’ ప్రవచనం వైరల్.. ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ

Kalki 2898 AD విధాత‌: ప్రభాస్ చేస్తోన్న మరో భారీ సినిమా.. ‘ప్రాజెక్ట్ K’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇప్పటికే సెట్స్‌పై ఉన్న ఈ సినిమా రోజుకో వార్తతో హైప్ పెంచుతోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ వరల్డ్‌ చిత్రంగా వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందీ చిత్రం. యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా రీసెంట్‌గా ఓ వీడియో ద్వారా మేకర్స్ తెలియపరిచారు. […]

  • Publish Date - July 24, 2023 / 07:54 AM IST

Kalki 2898 AD

విధాత‌: ప్రభాస్ చేస్తోన్న మరో భారీ సినిమా.. ‘ప్రాజెక్ట్ K’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇప్పటికే సెట్స్‌పై ఉన్న ఈ సినిమా రోజుకో వార్తతో హైప్ పెంచుతోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ వరల్డ్‌ చిత్రంగా వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందీ చిత్రం.

యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా రీసెంట్‌గా ఓ వీడియో ద్వారా మేకర్స్ తెలియపరిచారు. ఆయనకు ఈ సినిమాలో నటిస్తున్నందుకుగానూ రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారనేలా వార్తలు హైలెట్ అవుతున్నాయి.

ప్రభాస్, కమల్ హాసన్‌తో పాటు ఇందులో అమితాబ్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ ప్రాజెక్ట్ K టైటిల్‌కి సంబంధించి మరింత సమాచారాన్ని బయటపెట్టింది చిత్రబృందం. చిత్ర టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ని కూడా వదిలారు.

ఈ సినిమాకు టైటిల్‌ ‘కల్కి 2898 AD’ అని తెలుపుతూ విడుదల చేసిన గ్లింప్స్.. ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇందులో కలియుగంలో రాక్షసుల భారిన పడిన ప్రజలను రక్షించే కల్కి అవతారం గురించి స్టోరీ ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

కల్కి అవతారం గురించి చాగంటి కోటేశ్వరరావుగారు గతంలో వివరించిన వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఆ వీడియో చూసిన వారంతా ‘కల్కి 2898 AD’ కూడా అలాగే ఉండబోతుందా అనే ఊహాగానాలను వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

పురాణాలకు సంబంధించి ఎలాంటి సమాచారాన్నైనా చక్కగా తన మాటలతో వివరించే ప్రవర్త చాగంటి కోటేశ్వరరావు. ఆయన చెప్పారంటే అది మనసుకు హత్తుకునేలా ఉండి భక్తులను ఇట్టే కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అలాంటి వీడియోలలో కల్కి అవతారం గురించి ఆయన వివరించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

దైవావతారం గురించి ఆయన వివరణను ప్రాజెక్ట్ కె సినిమాకు కనెక్ట్ చేసుకుని సినిమా ఎలా ఉండ బోతుందనే ఊహకు తెరతీస్తున్నారు. ఇక ఈ వీడియో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులే లేవంటే నమ్మాలి. చిన్న గ్లింప్స్‌తోనే ఈ రేంజ్ సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తున్న ఈ మూవీ.. విడుదల తర్వాత ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే.. ఓ హై వచ్చేస్తుంది. ‘కల్కి’ గురించి చాగంటి వారు ఏం చెప్పారో మీరూ చూసేయండి.

Latest News