Kalki| వాయిదాల మీద వాయిదా పడుతున్న క‌ల్కి.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..!

  • By: sn    latest    Apr 10, 2024 7:47 PM IST
Kalki| వాయిదాల మీద వాయిదా పడుతున్న క‌ల్కి.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..!

Kalki| బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ సినిమాల‌పై అంద‌రిలో ఆస‌క్తి నెలకొంది. ఆయ‌న న‌టించిన ప్ర‌తి సినిమాపై ఆస‌క్తి చూపుతున్నారు. అయితే బాహుబలి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు ఫ్లాపులుగా నిలిచిన స‌లార్ చిత్రం మాత్రం మంచి హిట్ కొట్టింది. ఈ క్ర‌మంలో ప్ర‌భాస్ మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఇప్పుడు ఆయ‌న న‌టిస్తున్న క‌ల్కి మూవీపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సోషియో ఫాంటసీ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు మూడేళ్లుగా ఈ చిత్రాన్ని దాదాపు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే వంటి స్టార్ కాస్ట్ ఉండ‌డంతో అంచ‌నాలు పీక్స్‌లో ఉన్నాయి.

అయితే ఈ మూవీ రిలీజ్‌పై అంద‌రిలో అనేక సందేహాలు నెల‌కొంటున్నాయి. ముందుగా కల్కి సినిమాను సంక్రాంతి రిలీజ్ అనుకున్నారు. ఆ తర్వాత మే 9 రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కాని ఇప్పుడు ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌లు ఉన్నాయి. అలానే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి. అయితే ఈ స‌మ‌యంలో మూవీని రిలీజ్ చేసి చేతులు కాల్చుకోవ‌డం ఎందుకు అని భావించిన చిత్ర బృందం కొత్త డేట్ కోసం వెతుకుతుంది. ఇప్ప‌టికే కొత్త రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తుండగా, కొత్త విడుద‌ల తేదీని ఏప్రిల్ 17న ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు ఎక్స్ వేదిక‌గా రాసుకోచ్చారు వైజ‌యంతి మూవీస్ సంస్థ‌.

ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ నేటితో పూర్తి కానున్న‌ట్టు తెలుస్తుంది. చిత్ర దర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా షూటింగ్ చేస్తూనే మ‌రోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు వచ్చిన ఔట్ పుట్ పై మేక‌ర్స్ చాలా సంతృప్తిగా ఉన్నారు. ఈ మూవీ భారతీయ సినీ చరిత్రలో మరో మైలు స్టోన్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. మే 30 చిత్రం విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ని ఫిలింనగ‌ర్‌లో ఓ టాక్ న‌డుస్తుంది. కల్కి’ మూవీ మహాభారత కాలంతో మొదలై సామాన్య శకం 2898 ADతో ముగుస్తుందని దర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఇప్ప‌టికే ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో తెలియ‌జేశాడు. మొత్తంగా 6 వేల యేళ్ల ప్రయాణాన్ని ‘కల్కి’ మూవీలో ప్రేక్షకులకు చూపించబోతున్నారు.