కల్వకుర్తి: నమాజ్‌కు వెళ్లి వస్తూ.. బాలుడు దుర్మరణం

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ సమీపంలోని పంజుగుల రోడ్డులో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ముగ్గురు బాలురు మోటార్ సైకిల్ పై మసీదుకు వెళ్లి వస్తుండగా విద్యుత్ స్తంభానికి ఢీకొట్టారు. దీంతో అఫ్రోజ్ ఖాన్ (15) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కల్వకుర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

  • By: krs    latest    Mar 24, 2023 12:30 AM IST
కల్వకుర్తి: నమాజ్‌కు వెళ్లి వస్తూ.. బాలుడు దుర్మరణం

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ సమీపంలోని పంజుగుల రోడ్డులో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ముగ్గురు బాలురు మోటార్ సైకిల్ పై మసీదుకు వెళ్లి వస్తుండగా విద్యుత్ స్తంభానికి ఢీకొట్టారు.

దీంతో అఫ్రోజ్ ఖాన్ (15) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కల్వకుర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.