Project-K | ప్రభాస్‌ సినిమాలో.. కమల్‌ ప్రతినాయక పాత్ర

roject-K | విధాత: ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న ప్రాజెక్టు కె(roject-K)మల్టీ స్టారర్‌ సినిమాలో ప్రముఖ హీరో కమల్‌ హాసన్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించనున్నారట. ఇందుకు గాను కమల్‌ హాసన్‌ వంద కోట్లు అడిగారని, నిర్మాతలు అందుకు అంగీకరించారని కూడా సినిమా వర్గాల భోగట్టా. నాగర్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించే ఈ సినిమాలో ఇంకా అమితాబ్‌ బచన్‌, దీపికా పదుకోనె, దిశా పఠానీ కూడా నటించనున్నారు. కమల్‌ హాసన్‌ పాత్ర గురించి అధికారికంగా ఇంకా ధృవీకరించనప్పటికీ ఈ సినిమా […]

  • Publish Date - June 16, 2023 / 10:38 AM IST

roject-K |

విధాత: ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న ప్రాజెక్టు కె(roject-K)మల్టీ స్టారర్‌ సినిమాలో ప్రముఖ హీరో కమల్‌ హాసన్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించనున్నారట. ఇందుకు గాను కమల్‌ హాసన్‌ వంద కోట్లు అడిగారని, నిర్మాతలు అందుకు అంగీకరించారని కూడా సినిమా వర్గాల భోగట్టా.

నాగర్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించే ఈ సినిమాలో ఇంకా అమితాబ్‌ బచన్‌, దీపికా పదుకోనె, దిశా పఠానీ కూడా నటించనున్నారు. కమల్‌ హాసన్‌ పాత్ర గురించి అధికారికంగా ఇంకా ధృవీకరించనప్పటికీ ఈ సినిమా అతిపెద్ద పాన్‌ ఇండియాగా రూపొందనున్నదని చెబుతున్నారు.

ఈ సినిమా జనవరి 12, 2024 న తెరపైకి వస్తుందని భావిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ అశ్వనీదత్‌ కూతుళ్లు స్వప్న దత్‌, ప్రియాదత్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్‌లో అమితాబ్‌ గాయ పడినందున ఆయన కోలుకోగానే తిరిగి షూటింగ్‌ ప్రారంభిస్తారని, సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నారని సినిమా వర్గాలు తెలిపాయి.

Latest News