Ghattamaneni Jayakrishna| ఘట్టమనేని జయకృష్ణ సినిమా ఎంట్రీపై అధికారిక అప్డేట్
హేశ్‌బాబు సోదరుడు, నటుడు దివంగత రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వెలువడింది. ‘ఆర్‌ఎక్స్ 100’ , మంగళవారం మూవీఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ హీరోగా పరిచయం కాబోతున్నారు. స్వయంగా అజయ్ భూపతే సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు.
విధాత: మహేశ్‌బాబు సోదరుడు, నటుడు దివంగత రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ (Ghattamaneni Jayakrishna) హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ(Tollywood Debut Film)పై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వెలువడింది. ‘ఆర్‌ఎక్స్ 100’ , మంగళవారం మూవీఫేమ్ అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో జయకృష్ణ హీరోగా పరిచయం కాబోతున్నారు. స్వయంగా అజయ్ భూపతే సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. తన పోస్టులో షేర్ చేసిన ఫోటో, వివరాలు చూస్తే తిరుమల బ్యాక్‌డ్రాప్ స్టోరీతో జయకృష్ణ సినిమా తెరకెక్కనున్నట్టు అర్థమవుతోంది. ఏబీ4తో ప్రారంభంకానున్న ఈ సినిమా టైటిల్‌ను త్వరలో ప్రకటిస్తామన్నారు. లవ్ స్టోరీ ప్రాథాన్యంగానే సినిమా ఉండబోతుందని సమాచారం.
ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. హీరోగా మహేశ్‌బాబు తొలి సినిమా ‘రాజకుమారుడు’ను కూడా అశ్వనీదత్ నిర్మించిన సంగతి తెలిసిందే. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. గతంలో సూపర్ స్టార్ కృష్ణతో కల్ట్ బ్లాక్‌బస్టర్ అగ్ని పర్వతం చిత్రాన్ని నిర్మించి, తరువాత రాజకుమారుడుతో ప్రిన్స్ మహేష్ బాబును తెలుగు సినిమాకు పరిచయం చేసిన అశ్విని దత్, ఇప్పుడు ఘట్టమనేని నుంచి మరో వారసుడిని వెండితెరకు పరిచయం చేస్తున్నారు. అజయ్ భూపతితో కలిసి మూడవ తరం స్టార్ జయ కృష్ణ ఘట్టమనేనితో ఒక మంచి ప్రేమకథను అశ్విని దత్ నిర్మిస్తుండటం విశేషం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram