Kandala | తుమ్మల, పొంగులేటి, షర్మిలలపై కందాల ఫైర్‌.. పాలేరులో మళ్లీ నాదే గెలుపంటూ ధీమా

Kandala | విధాత : పాలేరు బీఆరెస్ సిటింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తన నియోజకవర్గంలో పోటీకి ఉవ్విళ్లూరుతున్న తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్‌.షర్మిలలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ తుమ్మలను ఐదేళ్లు మంత్రిని చేస్తే తను గెలువలేదు. జిల్లాలో ఒక్క సీటు కూడా గెలిపించుకోలేదంటు విమర్శించారు. ఎన్నికల్లో ఓడిన తుమ్మలను ఎమ్మెల్సీగా చేసి, గతంలో మంత్రిగా చేయడం ఆయనకు సీఎం కేసీఆర్ చేసిన అన్యాయమా అంటూ ప్రశ్నించారు. ఇక పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం […]

  • By: krs    latest    Sep 01, 2023 12:01 AM IST
Kandala | తుమ్మల, పొంగులేటి, షర్మిలలపై కందాల ఫైర్‌.. పాలేరులో మళ్లీ నాదే గెలుపంటూ ధీమా

Kandala |

విధాత : పాలేరు బీఆరెస్ సిటింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తన నియోజకవర్గంలో పోటీకి ఉవ్విళ్లూరుతున్న తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్‌.షర్మిలలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ తుమ్మలను ఐదేళ్లు మంత్రిని చేస్తే తను గెలువలేదు. జిల్లాలో ఒక్క సీటు కూడా గెలిపించుకోలేదంటు విమర్శించారు.

ఎన్నికల్లో ఓడిన తుమ్మలను ఎమ్మెల్సీగా చేసి, గతంలో మంత్రిగా చేయడం ఆయనకు సీఎం కేసీఆర్ చేసిన అన్యాయమా అంటూ ప్రశ్నించారు. ఇక పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం జిల్లాలో బీఆరెస్‌ను ఒక్క సీటును కూడా గెలువనియ్యనంటున్నాడని, ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఎన్నికల్లో చూద్దామన్నారు.

ఇక పాలేరులో పోటీ చేస్తానన్న షర్మిల రాజన్న రాజ్యం తెస్తానని, తానే సీఎం అవుతానని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ కోసం సోనియాగాంధీని కలువడం విషాదకరమన్నారు.

అసలు షర్మిల తెలంగాణ కోడలు ఎలా అవుతుందని, ఆమె మామ ఊరు గుంటూరు అన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులు ఎవరెన్ని కలలుగన్నా వచ్చే ఎన్నికల్లో నిత్యం ప్రజల మధ్య ఉండే తానే పాలేరు నుంచి గెలిచేదని కందాల ధీమా వ్యక్తం చేశారు.,