Karimnagar | దేశ ప్రజలను కదిలించిన శక్తిమంతుడు గద్దర్: వేణుగోపాల్
Karimnagar విధాత బ్యూరో, కరీంనగర్: భారతదేశానికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఒక సామాజిక విప్లవ సాంస్కృతిక ఐకాన్ లాంటి వారని, దేశ ప్రజలను కదిలించిన శక్తిమంతుడని ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరవి వేణుగోపాల్ కొనియాడారు. పీడిత తాడిత, పేద బడుగు బలహీన వర్గాల, కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన, మహిళలను చైతన్యం పరచడంలో ఆయనది గొప్ప ఘనమైన పాత్ర అన్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వివిధ ప్రజాసంఘాల […]

Karimnagar
విధాత బ్యూరో, కరీంనగర్: భారతదేశానికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఒక సామాజిక విప్లవ సాంస్కృతిక ఐకాన్ లాంటి వారని, దేశ ప్రజలను కదిలించిన శక్తిమంతుడని ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరవి వేణుగోపాల్ కొనియాడారు. పీడిత తాడిత, పేద బడుగు బలహీన వర్గాల, కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన, మహిళలను చైతన్యం పరచడంలో ఆయనది గొప్ప ఘనమైన పాత్ర అన్నారు.
ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు ఘన నివాళులు అర్పించారు. ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అధ్యక్షతన ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్న యాదిలో సంస్మరణ సభ స్థానిక ఫిలిం భవన్ లో జరిగింది.
ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ దేశ ప్రజలను కదిలించిన మహానీయుడు గద్దర్ తెలుగు రాష్ట్రాలలో సామాజిక విప్లవ కళాకారులందరూ 50 వేల మందితో హైదరాబాదులో కవాతు జరిపించాలని వారికి విజ్ఞప్తి చేశారు.
గొప్ప గొప్ప నక్సలైట్ నాయకులు అందరూ కలిసి చేసిన ప్రభావం కంటే గద్దర్ ఒక్కరే అన్ని వర్గాల ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేశారన్నారు. మావోయిస్టు జనశక్తి పార్టీలు ఆయనకు ఘనమైన నివాళులు అర్పించాలని కోరారు. ఆయన పేరు మీద తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డను ఆనుకొని 100 ఎకరాల స్థలంలో విగ్రహంతో పాటు పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నక్సలైట్ ఉద్యమానికి సామాజిక ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి గద్దర్ చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు.
సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గద్దర్ పాటలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. కరీంనగర్ పట్టణంలో గద్దర్ విగ్రహాన్ని తానే స్వయంగా ఏర్పాటు చేస్తానని సంతాప సభలో ప్రకటించారు. గద్దర్ ఆశయాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో యునైటెడ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొగురం రమేష్, జమాతే ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షులు కైరుద్దీన్, మౌలానా జియా ఉల్లా ఖాన్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్నం రాజ మల్లయ్య, ఎస్టిఓ దళిత నాయకులు దేవేందర్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఈశ్వర్, టీపీసీసీ నాయకులు రహమత్, దళిత నాయకులు మేడి మహేష్, మాదరి శ్రీనివాస్, కడపల విజయకుమార్, గజ్జల ఆనందరావు, బోయినపల్లి చంద్రయ్య, చిగిరి శ్రీధర్, కట్ట శ్రీనివాస్ , కాల్వ సురేష్ యాదవ్, న్యాయవాదులు పెంచాల ప్రభాకర్ రావు నీరుమళ్ళ శంకర్, వెన్న ఆనంద్ ముద్ద మల్ల అశోక్, ప్రస్తము ఆంజనేయులు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.