Karimnagar | పేదల ప్రాణాలపై దయలేని కేసీఆర్

Karimnagar | కొనసాగుతున్న నేతన్నల ఆత్మహత్యలు దేనికి నిదర్శనం బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేష్ విధాత: పేదల ప్రాణాలపై కేసీఆర్ ప్రభుత్వానికి దయలేదని, కొనసాగుతున్న నేతన్నల ఆత్మహత్యలు దేనికి నిదర్శనమని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా శంకర పట్నం మండలం గద్దపాకలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కళాకారుడు నామని సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బాధిత కుటుంబాన్ని మంత్రి కేటీఆర్, […]

  • By: krs    latest    Aug 22, 2023 4:52 PM IST
Karimnagar | పేదల ప్రాణాలపై దయలేని కేసీఆర్

Karimnagar |

  • కొనసాగుతున్న నేతన్నల ఆత్మహత్యలు దేనికి నిదర్శనం
  • బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేష్

విధాత: పేదల ప్రాణాలపై కేసీఆర్ ప్రభుత్వానికి దయలేదని, కొనసాగుతున్న నేతన్నల ఆత్మహత్యలు దేనికి నిదర్శనమని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా శంకర పట్నం మండలం గద్దపాకలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కళాకారుడు నామని సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, బాధిత కుటుంబాన్ని మంత్రి కేటీఆర్, ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వెంటనే పరామర్శించి, ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేతన్నల బలవన్మ రణాలపై కేసీఆర్ కు కనికరం లేదని, సర్కారుకు చీమకుట్టినట్టుగా లేకపోవడం విచారకరమన్నారు.

పద్మశాలీ నాయకత్వంలో పోరాటతత్వం, ప్రతిఘటన లేకపోవడం వల్లనే సర్కారులో చలనం కరువైందన్నారుk. అనంతరం బాధిత కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయాన్ని సమితి తరపున అందించారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జక్కని సంజయ్, మడత కిషోర్, ఆకాష్ గౌడ్ పాల్గొన్నారు.