Karimnagar: పాఠశాలలో మాతృ వందనం.. ఐదేళ్లుగా పాఠశాల వీడ్కోలులో మాతృమూర్తులకు పాదపూజ
అమ్మేగా తొలి గురువు.. తల్లి ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమం విధాత, కరీంనగర్ బ్యూరో: "మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ.. అంటూ తల్లితండ్రుల గొప్పతనాన్ని తెలియచెప్పే ఈ నానుడి భారతీయ సంస్కృతి మూలాల్లో ఒకటిష " అమ్మను మించి దైవమున్నదా… ఆత్మను మించి అర్థమున్నదా.. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే.. అవతార పురుషుడైనా అమ్మకు కొడుకే.."20వ శతాబ్దం సినిమాలోని గీతం తల్లి గొప్పతనానికి ప్రతీక. ఆ గొప్పదనపు మాధుర్యాన్ని పిల్లలకు అందించాలని, దీనిని అందిపుచ్చుకొని భవిష్యత్తులో వారు ఉన్నతంగా […]
- అమ్మేగా తొలి గురువు..
- తల్లి ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమం
విధాత, కరీంనగర్ బ్యూరో: “మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ.. అంటూ తల్లితండ్రుల గొప్పతనాన్ని తెలియచెప్పే ఈ నానుడి భారతీయ సంస్కృతి మూలాల్లో ఒకటిష ” అమ్మను మించి దైవమున్నదా… ఆత్మను మించి అర్థమున్నదా.. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే.. అవతార పురుషుడైనా అమ్మకు కొడుకే..”20వ శతాబ్దం సినిమాలోని గీతం తల్లి గొప్పతనానికి ప్రతీక.

ఆ గొప్పదనపు మాధుర్యాన్ని పిల్లలకు అందించాలని, దీనిని అందిపుచ్చుకొని భవిష్యత్తులో వారు ఉన్నతంగా ఎదగాలని భావించిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గడచిన ఐదేళ్లుగా విద్యార్థులచే ‘మాతృ వందన’ కార్యక్రమాన్ని చేయిస్తూ పాఠశాలల్లో జరిగే వీడ్కోలు సమావేశాలకు కొత్త సొబగులు అద్దారు.
గురుకులాల స్థానాన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు ఆక్రమించడంతో విలువలు, భారతీయ సంస్కృతి వంటి అంశాలకు అక్కడ తావే లేకుండా పోతుంది. ఆంగ్ల విద్య ప్రవాహ ఒడిలో, మార్కుల జడిలో కొట్టుకుపోతున్న విద్యార్థులు మంచి, చెడులను ఆకలింపు చేసుకోలేకపోతున్నారు.

విషయానికి వస్తే… ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల ఏదైనా కానీ వీడ్కోలు సమావేశం అంటే.. ఊపునిచ్చే డీజే, ఉర్రూతలూగించే పాటల సందడే. కానీ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాత్రం ఇందుకు విరుద్ధం. ఇక్కడ వీడ్కోలు పార్టీ అంటే… తల్లి ప్రాముఖ్యత తెలియజేసే ప్రత్యేక కార్యక్రమం. ఈ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసి బయటకు వెళ్లే విద్యార్థులు తమ తల్లికి తప్పక ప్రణామం ఆచరించాల్సిందే.

బుధవారం ఈ పాఠశాలల్లో జరిగిన వీడ్కోలు కూడా ఇదే రీతిన కొనసాగి స్థానికుల్ని ఆకట్టుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కట్టా రవీంద్ర చారి, అధ్యాపక బృందం గత ఐదేళ్లుగా విద్యార్థుల వీడ్కోలు పార్టీలో ఈ కొత్త సంస్కృతి అమలు చేస్తూ వస్తున్నారు.
పదవ తరగతి విద్యార్థులంతా తప్పనిసరిగా తల్లులతో కలిసి వచ్చి, వారిని వేదికపై ఉన్న కుర్చీలలో కూర్చోబెట్టి, వారి కాళ్ళను తాంబాలంలో ఉంచి… భక్తిశ్రద్ధలతో పాదాలు కడుగుతూ… పూలు చల్లుతూ తమ మాతృ ప్రేమను చాటుకుంటారు.
తమ పిల్లలు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆ తల్లులు ఈ సందర్భంగా పిల్లలను ఆశీర్వదిస్తారు. తల్లితండ్రులను చిన్నచూపు చూసే పిల్లలకు ఇదో కనువిప్పు లాంటి కార్యక్రమం అని స్థానికులు అంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram