Amul | అమూల్‌కు షాకిచ్చిన బెంగళూరు హోటల్స్ అసోసియేషన్..!
Amul | కర్ణాటకలో అమూల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ స్థానిక డెయిరీ నందిని ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది. స్థానిక పాడి రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బృహత్ బెంగళూరు అసోసియేషన్ తెలిపింది. ఇప్పటికే అమూల్ విషయంలో కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రైతులు, పశువుల కాపరుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అమూల్‌ను కర్ణాటకలో నిషేధించాలని కాంగ్రెస్, జేడీఎస్ డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం సహాయంతో గుజరాత్ అమూల్ బ్రాండ్‌ను కర్ణాటకలో మార్కెట్‌లోకి […]

Amul | కర్ణాటకలో అమూల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ స్థానిక డెయిరీ నందిని ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది. స్థానిక పాడి రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బృహత్ బెంగళూరు అసోసియేషన్ తెలిపింది. ఇప్పటికే అమూల్ విషయంలో కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రైతులు, పశువుల కాపరుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అమూల్‌ను కర్ణాటకలో నిషేధించాలని కాంగ్రెస్, జేడీఎస్ డిమాండ్ చేస్తున్నాయి.
కేంద్రం సహాయంతో గుజరాత్ అమూల్ బ్రాండ్‌ను కర్ణాటకలో మార్కెట్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ బ్రాండ్ నందినిని ధ్వంసం చేసేందుకు కుట్ర పన్నుతోందని, ప్రజలు ఐక్యంగా ఉండి నిరసన తెలపాలని జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో అమూల్ ప్రవేశాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది. రాష్ట్రంలో డెయిరీ రంగాన్ని నాశనం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ మండిపడుతున్నది. అయితే, అమూల్ నిర్ణయాన్ని ప్రభుత్వం సమర్థించింది. సమస్యను రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేసింది.