Karnataka | గుండెపోటుతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మృతి
Karnataka | కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్( Congress working president ) ఆర్ ధృవనారాయణ్( R Dhruvanarayan )గుండెపోటు( Cardiac Arrest )కు గురయ్యాడు. మైసూరు( Mysuru )లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున ధృవనారాయణ్ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ధృవనారాయణ్ మృతిపట్ల కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యతో పాటు పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శనివారం తెల్లవారుజామున ఛాతీలో నొప్పి వస్తుందని ధృవనారాయణ్ తన […]
Karnataka | కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్( Congress working president ) ఆర్ ధృవనారాయణ్( R Dhruvanarayan )గుండెపోటు( Cardiac Arrest )కు గురయ్యాడు. మైసూరు( Mysuru )లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున ధృవనారాయణ్ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ధృవనారాయణ్ మృతిపట్ల కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యతో పాటు పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
శనివారం తెల్లవారుజామున ఛాతీలో నొప్పి వస్తుందని ధృవనారాయణ్ తన డ్రైవర్‌కు తెలిపారు. దీంతో ఆయనను డీఆర్ఎంఎస్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి ఉదయం 6:40 గంటలకు తీసుకొచ్చారని, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని డాక్టర్ మంజునాథ్ తెలిపారు.
ధృవనారాయణ్ మృతిపట్ల కర్ణాటక కాంగ్రెస్( Karnataka Congress ) ట్వీట్ చేసింది. మాజీ ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధృవనారాయణ్ గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతికి పార్టీకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. ధృవనారాయణ్ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం కల్పించాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.
ರಾಜ್ಯ ಕಾಂಗ್ರೆಸ್ ಹಿರಿಯ ನಾಯಕರು, ಮಾಜಿ ಸಂಸದರು, ಕೆಪಿಸಿಸಿ ಕಾರ್ಯಾಧ್ಯಕ್ಷರಾಗಿದ್ದ ಶ್ರೀಯುತ ಧೃವ ನಾರಾಯಣ ಅವರು ಹೃದಯಾಘಾತದಿಂದ ನಿಧನರಾಗಿದ್ದು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷಕ್ಕೆ ತುಂಬಲಾರದ ನಷ್ಟವಾಗಿದೆ. ಮೃತರ ಆತ್ಮಕ್ಕೆ ಸದ್ಗತಿ ಸಿಗಲಿ. ಅವರ ಕುಟುಂಬಕ್ಕೆ ಈ ದುಃಖ ಭರಿಸುವ ಶಕ್ತಿ ದೊರಕಲಿ. pic.twitter.com/rU6gDhdn38
— Karnataka Congress (@INCKarnataka) March 11, 2023
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram