Karnataka Elections | కాంగ్రెస్‌కు కన్నడ సూపర్‌ స్టార్‌ ప్రచారం.. పార్టీలో చేరిన శివరాజ్‌కుమార్‌ భార్య

Karnataka Elections ఇప్పటికే బీజేపీ తరఫున ప్రచారంలో సుదీప్‌ కిచ్చా కర్ణాటక ప్రచారంలో శాండల్‌వుడ్‌ పరిమళాలు విధాత: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో శాండల్‌వుడ్‌ పరిమళాలు ప్రచారాన్ని మరింత రసవత్తరం చేయనున్నాయి. ఇప్పటికే సుదీప్‌ కిచ్చా వంటి ప్రముఖులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా.. తాజాగా కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ కూడా ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. శివరాజ్‌కుమార్‌ భార్య గీత కాంగ్రెస్‌లో చేరారు. తన భార్య నిర్ణయానికి మద్దతు పలికిన శివరాజ్‌కుమార్‌.. తామిద్దరం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ […]

Karnataka Elections | కాంగ్రెస్‌కు కన్నడ సూపర్‌ స్టార్‌ ప్రచారం.. పార్టీలో చేరిన శివరాజ్‌కుమార్‌ భార్య

Karnataka Elections

  • ఇప్పటికే బీజేపీ తరఫున ప్రచారంలో సుదీప్‌ కిచ్చా
  • కర్ణాటక ప్రచారంలో శాండల్‌వుడ్‌ పరిమళాలు

విధాత: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో శాండల్‌వుడ్‌ పరిమళాలు ప్రచారాన్ని మరింత రసవత్తరం చేయనున్నాయి. ఇప్పటికే సుదీప్‌ కిచ్చా వంటి ప్రముఖులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా.. తాజాగా కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ కూడా ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. శివరాజ్‌కుమార్‌ భార్య గీత కాంగ్రెస్‌లో చేరారు. తన భార్య నిర్ణయానికి మద్దతు పలికిన శివరాజ్‌కుమార్‌.. తామిద్దరం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తామని ప్రకటించారు.

శనివారం నుంచే తమ ప్రచారం మొదలవుతుందని కూడా చెప్పారు. గీతా శివరాజ్‌కుమార్‌ 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌ తరఫున మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్పపై పోటీ చేసి భారీ తేడాతో ఓడిపోయారు. ఇది ఆమెకు రెండో రాజకీయ పార్టీ.

సోదరుడి తరఫున ప్రచారం

శివరాజ్‌కుమార్‌ దంపతులు సోరాబా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మధు బంగారప్ప తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ మధు బంగారప్ప మరెవరో కాదు. గీత శివరాజ్‌కుమార్‌ సోదరుడే. వీరిద్దరూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ బంగారప్ప పిల్లలే. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. మధుబంగారప్ప ప్రత్యర్థి కూడా ఎవరో కాదు.. ఆయన సొంత సోదరుడు కుమార బంగారప్ప.

ఈ స్థానంలో ఆయన సిటింగ్‌ ఎమ్మెల్యే. ఈ స్థానంతోపాటు.. భీమన్న నాయిక పోటీ చేస్తున్న సిర్సి నియోజకవర్గంలో కూడా శివరాజ్‌కుమార్‌ దంపతులు కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేయనున్నారు. గీతా శివరాజ్‌ కుమార్‌ కాంగ్రెస్‌లో చేరడం సామాజిక మాధ్యమాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. గీతాశివరాజ్‌కుమార్‌ చేరికతో కాంగ్రెస్‌కు మరో సినీ స్టార్‌ క్యాంపెయినర్‌ దొరికినట్టయింది.