Twitter | ట్విట్టర్‌కు.. రూ.50 లక్షల జరిమానా
45 రోజుల్లో కర్ణాటక లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలి దాటితే రోజుకు అదనంగా రూ.5000 ఫైన్: కర్ణాటక హైకోర్టు విధాత: ప్రఖ్యాత సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్ (Twitter)కు కర్ణాటక హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లో కర్ణాటక లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని శుక్రవారం ఆదేశించింది. చెల్లింపులో ఆలస్యమైన ప్రతి రోజుకు రూ. 5,000 అదనపు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అసలు కేసు ఏమిటంటే.. కొందరికి సంబంధించిన ట్వీట్లు, ఖాతాలను […]

- 45 రోజుల్లో కర్ణాటక లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలి
- దాటితే రోజుకు అదనంగా రూ.5000 ఫైన్: కర్ణాటక హైకోర్టు
విధాత: ప్రఖ్యాత సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్ (Twitter)కు కర్ణాటక హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లో కర్ణాటక లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని శుక్రవారం ఆదేశించింది. చెల్లింపులో ఆలస్యమైన ప్రతి రోజుకు రూ. 5,000 అదనపు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
అసలు కేసు ఏమిటంటే..
కొందరికి సంబంధించిన ట్వీట్లు, ఖాతాలను బ్లాక్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ట్విట్టర్ కంపెనీని కోరింది. ప్రభుత్వ ఆదేశాన్ని సవాలు చేస్తూ ట్విట్టర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ధర్మాసనం తోసిపుచ్చింది.
పిటిషన్ దాఖలు చేసినందుకు మైక్రో బ్లాగింగ్ సైట్‌పై జస్టిస్ కృష్ణ దీక్షిత్ రూ.50 లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని 45 రోజుల్లో కర్ణాటక లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించారు. 45 రోజులు దాటినా చెల్లించని పక్షంలో రోజుకు అదనంగా మరో రూ.5000 ఫైన్‌గా చెల్లించాలని ఆదేశించారు.
ట్వీట్లు, ఖాతాలను బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తున్నట్లు హైకోర్టు విచారణ సందర్భంగా పేర్కొన్నది. చట్టం గురించి తెలియక ప్రభుత్వ ఆదేశాలను పాటించలేదని వాదించడానికి ట్విట్టర్ సాధారణ కంపెనీ కంపెనీ కాదని, బిలియన్ డాలర్ల టెక్ కంపెనీ అని జస్టిస్ దీక్షిత్ వెల్లడించారు.