MP Prajwal | జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అనర్హత వేటు
కర్ణాటక హైకోర్టు తీర్పు MP Prajwal | విధాత :జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లోక్ సభ సభ్యత్వంపై కర్ణాటక హైకోర్టు అనర్హత వేటు వేసింది. 2019లోక్ సభ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం అందించిన కేసులోఆయనను లోక్‌సభకు అనర్హుడిగా ప్రకటించింది. ప్రజ్వల్ రేవణ్ణ హసన్ లోక్‌సభ స్థానం ఎంపీగా కొనసాగుతున్నారు. ఎన్నికలకు మరో 6నెలల సమయం ఉండగానే ఆయనపై అనర్హత వేటు పడింది. మాజీ కేడీపీ పార్టీ సభ్యులు, న్యాయవాది జి.దేవరాజేగౌడ రాష్ట్ర ఎన్నికల సంఘానికి […]
- కర్ణాటక హైకోర్టు తీర్పు
MP Prajwal | విధాత :జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లోక్ సభ సభ్యత్వంపై కర్ణాటక హైకోర్టు అనర్హత వేటు వేసింది. 2019లోక్ సభ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం అందించిన కేసులోఆయనను లోక్‌సభకు అనర్హుడిగా ప్రకటించింది. ప్రజ్వల్ రేవణ్ణ హసన్ లోక్‌సభ స్థానం ఎంపీగా కొనసాగుతున్నారు. ఎన్నికలకు మరో 6నెలల సమయం ఉండగానే ఆయనపై అనర్హత వేటు పడింది.
మాజీ కేడీపీ పార్టీ సభ్యులు, న్యాయవాది జి.దేవరాజేగౌడ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్నికల సంఘం పలు విచారణలు జరిపి కోర్టుకు నివేదిక సమర్పించింది.అలాగే ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణపై పోటీ చేసి ఓడిన అభ్యర్ధి ఎ.మంజు సైతం రేవణ్ణపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేశారు. ఆ కేసుల విచారణ నేపధ్యంలో కర్ణాటక హైకోర్టు రేవణ్ణ లోక్ సభ సభ్యత్వాన్ని రద్ధు చేస్తూ తీర్పునిచ్చింది
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram