Honey Trap: హనీ ట్రాప్ ఉచ్చులో మంత్రులు, ఎమ్మెల్యేలు!
కొన్నాళ్ల క్రితం హనీ ట్రాప్ ప్రక్రియను ఓ దేశం మరో దేశం ఇంటలిజెన్స్, రక్షణ, విదేశీ రహాస్యాలను రాబట్టడంలో వినియోగించేవారు. క్రమంగా అది సమాజంలోని అన్ని రంగాల్లోకి విస్తరించి బ్లాక్ మెయిలింగ్ ప్రక్రియగా మారిపోయింది. హనీ ట్రాప్ ఇప్పుడు ప్రముఖులకు తలనొప్పిగా తయారైంది.

హనీ ట్రాప్ ఇప్పుడు ఈ పేరు వింటేనే దేశంలోని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వణికిపోతున్నారు. అందమైన యువతులను ఎరగా వేసి తమ ట్రాప్ లో పడేసి క్రమంగా వారి నుంచి తమకు కావాల్సిన సమాచారం రాబట్టుకోవడం లేక బ్లాక్ మెయిలింగ్ చేయడం హనీ ట్రాప్ గా కొనసాగుతోంది. కొన్నాళ్ల క్రితం హనీ ట్రాప్ ప్రక్రియను ఓ దేశం మరో దేశం ఇంటలిజెన్స్, రక్షణ, విదేశీ రహాస్యాలను రాబట్టడంలో వినియోగించేవారు. క్రమంగా అది సమాజంలోని అన్ని రంగాల్లోకి విస్తరించి బ్లాక్ మెయిలింగ్ ప్రక్రియగా మారిపోయింది. హనీ ట్రాప్ ఇప్పుడు ప్రముఖులకు తలనొప్పిగా తయారైంది.
కర్ణాటక రాష్ట్రంలో ఇప్పుడు హనీ ట్రాప్ హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా కర్ణాటక సహకరా శాఖ మంత్రి కేఎన్.రాజన్న అసెంబ్లీ వేదికగా 48 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు, నాయకులు హనీ ట్రాప్ బారిన పడ్డారని వెల్లడించడం సంచలనంగా మారింది. 48 మంది నాయకుల అసభ్య వీడియోలు సీడీలు, పెన్ డ్రైవ్ లు, సీడీలలో ఉన్నాయని.. ఇందులో అధికార, విపక్ష పార్టీ సభ్యులు ఉన్నారని, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డారని వెల్లడించారు. రెండు సార్లు నాపై, నా కుమారుడిపై కూడా హనీట్రాప్ జరిగిందని, దీనిపై హోంశాఖకు ఫిర్యాదు చేశానని, దీని వెనక ఎవరు ఉన్నారనే విషయం ప్రజలకు కూడా తెలియాలని స్పష్టం చేశారు. హనీ ట్రాప్ కేవలం కర్ణాటకకే పరిమితం కాలేదని..దేశమంతా విస్తరించిందని పలువురు కేంద్ర మంత్రులు సైతం వలపు వలలో చిక్కుకున్నారన్నారు. బాధితుల్లో చాలామంది హైకోర్టులో స్టే తెచ్చుకున్నారని.. ఇప్పుడు నా పేరు ప్రస్తావనకు వచ్చిందని.. దీనిపై హోంశాఖ విచారణ చేసి పాత్రదారులు, సూత్రదారులు ఎవరో తేల్చాలన్నారు.
పీడబ్ల్యూడీ మంత్రి సతీష్ జార్కిహొళి మాట్లాడుతూ ఇటీవల ఇద్దరు మంత్రులపై రెండుసార్లు హనీ ట్రాప్ యత్నం జరిగిందని, సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో వారి అభ్యంతరకర వీడియోలు, సంభాషణలు ఉన్నాయని బాంబు పేల్చారు. బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల వారు హనీ ట్రాప్ బాధితులుగా ఉన్నారన్నారు. ఇది కొత్త కాదని, 20ఏళ్లుగా కొనసాగుతుందని..రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారన్నారు. గతంలో తనపై కూడా రెండుసార్లు హనీట్రాప్‌కి ప్రయత్నించినా.. అవి బెడిసికొట్టాయని పేర్కొన్నారు.
బీజేపీ ఎమ్మెల్యేలు బసవగౌడ పాటిల్, వి.సునీల్ కుమార్ లు మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం హనీ ట్రాప్ ఫ్యాక్టరీ నడిపిస్తుందని ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వరన్ స్పందిస్తూ హనీ ట్రాప్ ఆరోపణలపై ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామని ప్రకటించారు. దీంతో మునుముందు హనీ ట్రాప్ వ్యవహారంలో ఎంతమంది రాజకీయ ప్రముఖుల పేర్లు తెరపైకి వస్తాయోనన్న అంశం ఆస్తకికరంగా మారింది.