Aravind | కవితకు ఈసారి మూడో స్థానమే: ఎంపీ ధర్మపురి అరవింద్

Aravind | విధాత ప్రతినిధి, నిజామాబాద్: ఎమ్మెల్సీ కవిత వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేస్తే.. మూడో స్థానానికే పరిమతమవుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో మంగళవారం జరిగిన దిశా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ దగ్గర మెప్పు పొందేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కవితను పొగుడ్తుంటే.. కవిత మాత్రం కాంగ్రెస్ వాళ్ళని పొగడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి కస్టర్డ్ ఆపిల్ కి, జామపండుకీ […]

  • By: krs    latest    Aug 29, 2023 12:50 AM IST
Aravind | కవితకు ఈసారి మూడో స్థానమే: ఎంపీ ధర్మపురి అరవింద్

Aravind |

విధాత ప్రతినిధి, నిజామాబాద్: ఎమ్మెల్సీ కవిత వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేస్తే.. మూడో స్థానానికే పరిమతమవుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో మంగళవారం జరిగిన దిశా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

సీఎం కేసీఆర్ దగ్గర మెప్పు పొందేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కవితను పొగుడ్తుంటే.. కవిత మాత్రం కాంగ్రెస్ వాళ్ళని పొగడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి కస్టర్డ్ ఆపిల్ కి, జామపండుకీ తేడా తెలియదన్నారు. నిన్న కవిత కాంగ్రెస్ నేతలని పొగుడుతుంటే మంత్రి ప్రశాంత్ మొహం వాడిపోయిందన్నారు.

మైనారిటీల సంక్షేమానికి కేంద్రం వేల కోట్లు నిధులు ఇస్తున్నదని, బీజేపీ మైనారిటీలకు వ్యతిరేఖం అని బీఅరెస్ సహా కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. పసుపు ఎగుమతులను పెంచామని, అందుకే రైతులకు మంచి ధరలు వస్తున్నాయన్నారు.

కవిత, మంత్రి ప్రశాంత్ పసుపు రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. కేసీఆర్ తెలంగాణలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, రాష్ట్రం బాగుండాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు.