Kavita: కవిత మాటలు క్షమించరానివి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు

Kavita: కవిత మాటలు క్షమించరానివి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం తెచ్చేవిగా ఉన్నాయని..ఆమె మాటలు క్షమించరానివని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఆక్షేపించారు. కవితకు అంత ఆవేశం ఎందుకు? కొంచెమైనా ఓపిక ఉండాలన్నారు. లేఖ లీక్ అంశంపై కేసీఆర్ మాట్లాడతారు కదా? అంత తొందర ఎందుకు? అని ప్రశ్నించారు. ఓ వైపు కాళేశ్వరంపై ప్రాజెక్టుపై నోటీసులపై ఎలా సమాధానం ఇవ్వాలన్న దానిపై..ప్రతిపక్షాల ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలన్నదానిపై కేసీఆర్ బిజీగా ఉన్న సమయంలో నా సంగతేమిటో తేల్చాలంటూ కవిత మారం చేయడం సరికాదన్నారు.

కాళేశ్వరం విచారణ ఎదుర్కొంటున్న సమయంలో కేసీఆర్ కు తగిన సమయం ఇవ్వకుండా లేఖ లీకేజీ..లేఖలోని అంశాలపై కేసీఆర్ సమాధానం చెప్పాలంటూ కవిత ఒత్తిడికి దిగడం బాగా లేదన్నారు. కేసీఆర్ ఎక్కడికి పోతారని తర్వాతైనా ఆమె వివాదం పరిష్కరించుకోవచ్చని..తొందరపడి విమర్శలకు దిగడం పార్టీకి నష్టదాయకంగా ఉందన్నారు. కేసీఆర్ మీకే కాదు లక్షలాది మంది ప్రజలకు కూడా కేసీఆర్ దేవుడన్నారు. దేవుడి ఆదేశాలు వచ్చే వరకు ఓపిక ఉండకుండా ఆయనపై దండెత్తడం ఎందుకని తక్కెళ్లపల్లి ప్రశ్నించారు.