Ambedkar Statue | అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్, ప్రకాష్ అంబేద్కర్

విధాత: హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డు జంక్షన్‌లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహాన్ని (Ambedkar Statue) అంబేద్కర్ మనుమడు, మాజీ ఎంపీ ప్రకాశ్ అంబేద్కర్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి కె.చంద్రశేఖర్ రావు అంబేద్కర్ స్మృతివనానికి చేరుకున్నారు. సుమారు 11.80 ఎకరాల సువిశాల ప్రదేశంలో 50 అడుగుల పీఠంపై దేశంలోనే 125 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ప్రతిష్టించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా […]

  • By: Somu    latest    Apr 14, 2023 11:05 AM IST
Ambedkar Statue | అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్, ప్రకాష్ అంబేద్కర్

విధాత: హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డు జంక్షన్‌లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహాన్ని (Ambedkar Statue) అంబేద్కర్ మనుమడు, మాజీ ఎంపీ ప్రకాశ్ అంబేద్కర్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు.

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి కె.చంద్రశేఖర్ రావు అంబేద్కర్ స్మృతివనానికి చేరుకున్నారు. సుమారు 11.80 ఎకరాల సువిశాల ప్రదేశంలో 50 అడుగుల పీఠంపై దేశంలోనే 125 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ప్రతిష్టించారు.

విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. బౌద్ద గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, వారిని ముఖ్యమంత్రి సన్మానం చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున దళితులు, అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు.

ఈ కార్యక్రమానికి శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాస‌న స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్‌, బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, మేయర్లతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు.

ప్రకాశ్ అంబేద్కర్‌ను కేసీఆర్ శాలువాతో సత్కరించి బౌద్ధ విగ్రహ ప్రతిమను బహూకరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంత కుమారి స్వాగతోపన్యాసం చేశారు. అంబేద్కర్ మ్యూజియంలోని స్టూడియోలో బీఆర్ అంబేద్కర్‌పై రూపొందించిన డాక్యుమెంటరీని ముఖ్యమంత్రితో పాటు ప్రకాశ్ అంబేద్కర్ తిలకించి సభా వేదికపైకి వచ్చారు.