RGV | శివ సినిమాతో తెలుగు సినిమాకో కొత్త కోణాన్ని చూపించిన రామ్ గోపాల్ వర్మ.. నెమ్మదిగా తన మార్క్‌ని చెరిపేసుకుంటూ బయోపిక్‌ల వెంట పడ్డాడు. అయితే సినిమా ఎలా తీసినా కూడా అందులో రామ్ గోపాల్ వర్మ టాలెంట్ దాగి ఉంటుంది. ఆయన తీయాలనుకున్న సినిమా కథకు సంబంధించి అది బయోపిక్ అయితే.. లేదా ఏదైనా కాన్సెప్ట్ చిత్రమైనా.. నటీ నటులను అందుకు అనుగుణంగా ఎన్నుకుంటూ ఉంటాడు. గతంలో వర్మ తీసిన సినిమాలకు సరిగ్గా పాత్రకు […]
RGV |
శివ సినిమాతో తెలుగు సినిమాకో కొత్త కోణాన్ని చూపించిన రామ్ గోపాల్ వర్మ.. నెమ్మదిగా తన మార్క్‌ని చెరిపేసుకుంటూ బయోపిక్‌ల వెంట పడ్డాడు. అయితే సినిమా ఎలా తీసినా కూడా అందులో రామ్ గోపాల్ వర్మ టాలెంట్ దాగి ఉంటుంది.
ఆయన తీయాలనుకున్న సినిమా కథకు సంబంధించి అది బయోపిక్ అయితే.. లేదా ఏదైనా కాన్సెప్ట్ చిత్రమైనా.. నటీ నటులను అందుకు అనుగుణంగా ఎన్నుకుంటూ ఉంటాడు. గతంలో వర్మ తీసిన సినిమాలకు సరిగ్గా పాత్రకు నప్పే ముఖాలనే పాత్రలుగా తీసుకున్నాడు.
ఈ విషయం తెలియంది కాదు. తాజాగా వర్మ ‘వ్యూహం’ సినిమా విషయంలోనూ అంతే జాగ్రత్తగా పాత్రల ఎంపికను చేశాడనే విషయం.. ఆయన విడుదల చేసిన ఫొటోలను చూస్తుంటే తెలుస్తోంది. వ్యూహం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇందులో జగన్ పాత్రకు తీసుకున్న నటుడు తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన అజ్మల్ అమీర్, వైఎస్ భారతి పాత్రకు మళయాళ నటి మానస రాధాకృష్ణన్ నటిస్తున్నది.
ఈ ఇద్దరి ఎంపిక కూడా సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. వ్యూహం అనగానే అదేదో అర్థం వస్తుంది కానీ.. ఇది చంద్రబాబు అహంకారం, జగన్ ఆలోచనలకు మధ్య జరిగే యుద్ధంగా చూపించబోతున్నాడు వర్మ. మూవీని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ తీస్తున్నాడు.
‘వ్యూహం’ షూటింగ్లో భాగంగా విజయవాడ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న సన్నివేషాన్ని చిత్రీకరించారు. వేదికపైన కేసీఆర్, స్టాలిన్ పోలికలున్న నటులను అదే పోలికలున్న వ్యక్తుల్ని దించేశాడు వర్మ. దీంతో ఒక్కసారిగా ‘వ్యూహం’పై అంచనాలు పెరిగిపోయాయి.
ఇలాంటి వాటికి తప్పితే.. వర్మలో ఒరిజినల్ క్రియేటివిటీ ఎప్పుడో చచ్చిపోయిందని.. ఆయనని వ్యతిరేకిం చే వారు కామెంట్స్ చేస్తుంటే.. అది అట్టా దింపు అంటూ ఆయన అభిమానులు.. వర్మకు సపోర్ట్ ఇస్తున్నారు. మొత్తంగా.. వ్యూహం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.